Gabbar Singh: ఆ స్పెషల్ డే రోజున అభిమానులకు ట్రీట్ ఇవ్వనున్న హరీష్ శంకర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెయిటింగ్ కి సాలిడ్ ట్రీట్ ఇచ్చి పదకొండేళ్ల కిందటి ఋణం తెర్చుకొనబోతున్నాడు. వివరాల్లోకి వెళితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు మూడు నెలలుగా గ్యాప్ లేకుండా చిత్ర యూనిట్ షూటింగ్ చేస్తుంది. అటు పవన్ కళ్యాణ్ “ఓజీ”, “హరిహర వీరమల్లు” షూటింగ్ లో పాల్గొంటూనే ఉస్తాద్ షూట్ లోను పాల్గొంటున్నాడు.

అయితే రీసెంట్ గా హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించి ఫ్యాన్స్ కి ప్రత్యేకమయిన రోజున ట్రీట్ ఇవ్వబోతున్నాడు. అదేంటంటే పవన్ కళ్యాణ్ హరీష్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. సరిగ్గా 11యేళ్ళ కిందట మే11 న విడుదలైన ఆ సినిమా పవన్ కళ్యాణ్ కి ఖుషి తర్వాత ఆ రేంజ్ హిట్ ఇచ్చింది. టాలీవుడ్ లో అప్పటివరకు ఉన్న పలు రికార్డులని తిరగరాసి మగధీర తర్వాత స్థానంలో నిలిచింది. దాదాపు 65కోట్ల షేర్ ని 120 కోట్ల గ్రాస్ ని వసూలు చేసి డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపించింది. చిరంజీవి తర్వాత ఖాళీగా ఉన్న నెంబర్ వన్ స్థానాన్ని పవన్ కళ్యాణ్ పొందేలా చేసింది.

హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ మూవీతో ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఈ సినిమా వచ్చిన మే 11వ రోజున హరిష్ శంకర్ తాను ప్రస్తుతం చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ యొక్క “గ్లిమ్ప్స్” ని రిలీజ్ చేయనున్నాడు. ఈ విషయాన్నీ స్వయంగా హరీష్ శంకర్ సోషల్ మీడియా ద్వారా చెప్పడం జరిగింది. మే 11 న హైదరాబాద్లో ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ లో సంధ్య 70mm లో ఈ గ్లిమ్ప్స్ ని అభిమానులకు చూపించబోతున్నారు. అయితే ఉస్తాద్ టీజర్ ని ఒక్క సంధ్య థియేటర్ లో తప్ప ఇతర థియేటర్లలో ప్లే చేయడం లేదని సమాచారం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు