Nandamoori Family: తారకరత్న చివరికోరిక తీర్చదానికి సిద్ధమైన భార్య?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి తారకరత్నకు మంచి క్రేజ్ ఉంది. దీనికి తోడు ఆయనకు మంచిది రికార్డు కూడా ఉంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగక ముందే చిత్ర సీమను విడిచిపెట్టారు ఆయన. ఇక ఇటీవలే నందమూరి తారకరత్న గుండెపోటుతో మరణించారు. అయితే తారకరత్న మరణించడంతో నందమూరి ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భార్య అలేఖ్య తారకరత్న జ్ఞాపకాల నుంచి ఇప్పటికి బయటపడలేకపోతోంది.

సోషల్ మీడియాలోని తన ఖాతా ద్వారా తన భర్తతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకుంటూ ఎమోషనల్ అవుతుంది. అటు అలేఖ్య తరచుగా భర్తపై తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు. అది కాస్త వైరల్ గా మారుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ వార్త సినీ, రాజకీయ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. అలేఖ్య తన భర్త చివరి కోరిక తీర్చడానికి సిద్ధమవుతున్నారట. ఎమ్మెల్యేగా టిడిపి తరపు నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారట.

2024 ఎన్నికల్లో గుడివాడ నుంచి ఆమె పోటీ చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ సంగతి ఏంటంటే? తనకు ఎంతో ఇబ్బందిగా మారిన కొడాలి నానికి చెక్ పెట్టడానికి చాలా ఏళ్ల నుంచి టిడిపి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తారకరత్న తన మరణానికి ముందు గుడివాడ నుంచి కొడాలి నానిపై పోటీ చేయాలని భావించారట. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారట.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు