Family Star: “ఐరనే ఒంచాలా ఏంటి”… ఒక్క డైలాగ్ తో హైప్ లేపారు కదయ్యా

డైరెక్టర్ పరశురాం బుజ్జి, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న సినిమా “ఫ్యామిలీ స్టార్“. ఈ సినిమా కంటే ముందు డైరెక్టర్ పరశురాం “సర్కారు వారి పాట” సినిమాతో అద్భుతమైన హిట్ అందుకున్నాడు. ఈ  సినిమా హిట్ తర్వాత యాక్చువల్గా పరశురాం నాగచైతన్యతో సినిమాను చేయాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.  ఈ విషయానికి సంబంధించి డైరెక్టర్ పరుశురాం నా టైం వేస్ట్ చేశాడు అంటూ నాగచైతన్య ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చిన మాట కూడా వాస్తవమే.

ఇకపోతే  విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ తో పాటు ఒక వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇంట్లో అన్ని పనులు చేసుకుని, అన్ని పనులు చూసుకుని, పిల్లల్ని స్కూలుకు పంపిస్తూ బాధ్యతగా ఉండే  ఒక ఫ్యామిలీ మెన్ గా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ని చూపించాడు.అయితే రిలీజ్ చేసిన  టీజర్ లో ఒక చిన్న పంచాయతీ జరిగిన తర్వాత దానిలో ఒక డైలాగ్ బాగా ఫేమస్ అయింది.  “ఐరనే ఒంచాలా ఏంటి” అనే  ఈ డైలాగ్ అప్పట్లో ఒక యాడ్ లా అనిపించింది.  కానీ ఇప్పుడు ఈ డైలాగును ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా ఎడిట్స్ చేస్తూ షేర్ చేయడం మొదలుపెట్టారు.

కేవలం షేర్ చేయడమే కాకుండా ఈ డైలాగును కొందరు సెలబ్రిటీలకి కొందరు పొలిటిషన్ కి అడాప్ట్ చేస్తూ వాళ్ళ వెర్షన్ లో డైలాగ్ ఎలా ఉంటుంది అని ఎడిట్స్ చేస్తున్నారు. ఈ డైలాగ్ కి అనేకమైన ఎడిటింగ్స్  చేస్తూ ఈ డైలాగ్ ను ట్రేండింగ్ లోకి తీసుకొచ్చారు.  ఇది గమనించిన మూవీ టీం ఇదే లైన్ ని పెట్టి ఒక ఆఫీసియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.  ఇంటర్నెట్లో ఏం నడుస్తుంది అని అంటే, “ఐరనే ఒంచాలా ఏంటి” అనే డైలాగ్ నడుస్తుందని విజయ్ దేవరకొండ కూడా తన ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ ని షేర్ చేశాడు. మొత్తానికి ఈ సినిమాకి సరైన పబ్లిసిటీ లేదు అనుకునే టైమ్ కి ఈ ఒక్క  డైలాగ్ సినిమా పైన క్యూరియాసిటీని పెంచుతుంది.
Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు