Vijay devarakonda: రష్మికను కోడలిగా రిజెక్ట్ చేసిన విజయ్ ఫ్యామిలీ ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఛలో సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరోయిన్ రష్మిక మందన్న… బాలీవుడ్ స్థాయికి ఎదిగింది. అల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర సక్సెస్ కావడంతో బాలీవుడ్లో రష్మిక మందన్నకు ఛాన్స్ వచ్చింది. ఇప్పటికే పలు సినిమాలు చేసిన రష్మిక మందన్న… ఇప్పుడు యానిమల్ సినిమాతో సందడి చేయనుంది.

అయితే రష్మిక మందన్న మరియు టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మధ్య రిలేషన్షిప్ నడుస్తుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే యానిమల్ సినిమా నుంచి నిన్న ఓ సాంగ్ రిలీజ్ అయింది. ఇందులో.. రొమాంటిక్ సీన్ లలో రష్మిక మందన్ననటించింది.

దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రష్మిక మందన్నపై ఫైర్ అవుతున్నారు. రష్మిక మందన్న బరితెగించి లిప్ లాక్ సీన్లో నటించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు విజయ్ దేవరకొండ తల్లి కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లు సమాచారం అందుతుంది. మొన్నటి వరకు రష్మిక మందన్నను కోడలు చేసుకుందామని అనుకున్నామని.. కానీ ఆ సాంగ్ కారణంగా తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు విజయ్ దేవరకొండ తల్లి తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. మరి దీనిపై రష్మిక ఎలా స్పందిస్తుందో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు