Vijay devarakonda : 100 కోట్ల బడ్జెట్ తో విజయ్ దేవరకొండ సినిమా – రిస్క్ చేస్తున్నారా ?

Vijay devarakonda

అవునండి నిజమే ! ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 కోట్ల భారీ బడ్జెట్ తో విజయ్ దేవరకొండ కొత్త సినిమా షూటింగ్ జరుపుకోనుందట. అయితే ఇది పలు వార్తలలాగా గాలి వార్త కాదు. స్వయంగా విజయ్ దేవరకొండ సినిమా కోసం వంద కోట్లు పెట్టి తీసే ప్రొడ్యూసరే స్వయంగా చెప్పాడు. ఇంతకుఎవరా ప్రొడ్యూసర్ ఎవరు ? ఏంటా ఆ సినిమా అని అనుకుంటున్నారా ? వివరాల్లోకి వెళ్తే.

విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యంగ్ యాక్ట్రెస్ శ్రీలీల విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

గత కొద్దీ రోజుల క్రితమే లాంఛనంగా ఈ సినిమా ఓపెనింగ్ ఫంక్షన్ కూడా జరిగింది. ఇక ఆ సమయంలోనే ఈ సినిమాకు సంబంధించి ఒక విజయ్ దేవరకొండ ప్రి లుక్ ను కూడా రివీల్ చేసారు మేకర్స్. స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం గాను ప్రొడ్యూసర్ నాగ వంశీ దాదాపు వంద కోట్ల వరకు ఖర్చుపెట్టబోతున్నారట.. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే మ్యాడ్ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తెలిపారు.

- Advertisement -

విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో రాబోతున్న ఆ సినిమా స్పై థ్రిల్లర్ జానర్ లో కథ సాగుతునప్పటికీ ఒక కొత్త రకమైన కథనంతో ఈ సినిమా ఉండబోతుందట అందుకే ఈ సినిమా కోసం దాదాపు బడ్జెట్ వంద కోట్ల వరకు వెచ్చించ బోతున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ లో ట్రేండింగ్ గా మారింది. ఎందుకంటే కేవలం మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ రేంజ్ ఉన్న స్టార్ హీరోల సినిమాల బడ్జెట్ మాత్రమే వంద కోట్ల వరకు ఉంటుంది. ఇక విజయ్ దేవరకొండ విషయానికొస్తే ఆయనకు ఇండియా వైడ్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ విజయ్ దేవరకొండ కెరీర్ ప్రస్తుతం అంతంత మాత్రంగానే ఉంది.

ఇటీవల కాలంలో విజయ్ కు హిట్స్ కన్నా కూడా ఎక్కువ ఫ్లాప్ లే ఎక్కువగా వచ్చాయి. ఇక రీసెంట్ గానే విజయ్ దేవరకొండ. ఖుషి సినిమాతో ఒక డీసెంట్ హిట్ ను కొట్టాడు. మరి ఇలాంటి సమయంలో విజయ్ తో వంద కోట్ల సినిమా అంటే రిస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే విజయ్ గత చిత్రం లైగర్ విషయంలో ఇలాగే రిస్క్ చేయడం వల్ల విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ ప్రస్తుతం డిస్టిబ్యూటర్స్ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా ఆ పరిస్థితి ఒక కొలిక్కి రాకముందే మరోసారి వంద కోట్ల సినిమా అంటే ఆలోచించాల్సిన విషయమే.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు