Vijay devarakonda: స్పీడ్ పెంచిన విజయ్ దేవరకొండ

Vijay devarakonda

విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ సినిమా ఖుషి సూపర్ హిట్ అవడంతో విజయ్ మంచి జోష్ లో ఉన్నట్టు తెలుస్తోంది. భారీ ఆశలు పెట్టుకున్న లైగర్ పరాజయం నుంచి విజయ్ కు ఖుషి సినిమా మంచి రిలీఫ్ ఇవ్వడంతో చకచక సినిమాలు చేసుకుంటూ పోవాలని విజయ్ దేవరకొండ గట్టిగ ఫిక్స్ అయినట్టు ఉన్నాడు.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం జెర్సీ సినిమా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక స్పై థ్రిల్లర్ యాక్షన్ సినిమా మరియు పరుశురాం డైరెక్షన్ లో ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ రెండు సినిమాల షూటింగ్ ను వెంట వెంటనే కంప్లిట్ చేయడానికి రెడీ అయ్యాడు రౌడీ బాయ్.

అయితే ఈ రెండు సినిమాలలో ముందుగా విజయ్ దేవరకొండ, పరుశరాం కాంబినేషన్ లో రాబోయే సినిమా ముందుగా రిలీజ్ అవబోతుంది. వచ్చే సంక్రాంతి పండగను దృష్టిలో పెట్టుకొని దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కేవలం రెండు భారీ షెడ్యూల్స్ లోనే ఈ సినిమాను 70 శాతం వరకు కంప్లిట్ చేసి, మిగితా 30 శాతం షూటింగ్ మరో రెండు షెడ్యూల్స్ లో ఫినిష్ చేయాలనీ చూస్తున్నారట మూవీ టీం.

- Advertisement -

ఇక ఈ సినిమాకు సంబంధించి మొదటి భారీ షెడ్యూల్ రేపటి నుంచే ప్రారంభం కానుందని సమాచారం. హైదరాబాద్ లో జరగోయే ఈ సినిమా షూటింగ్ లో మొదటి రోజు నుంచే విజయ్ దేవరకొండ పాల్గొనబోతున్నాడు. ఈ షెడ్యూల్ లోనే విజయ్ దేవరకొండ,హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కు సంబందించిన సీన్స్ ను షూట్ చేయబోతున్నారట. దీన్నిబట్టి చూస్తే సంక్రాంతి పండగకు విజయ్ దేవరకొండ తన అభిమానులకు మరో సూపర్ హిట్ ఇచ్చేల ఉన్నట్టు తెలుస్తోంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు