Jr NTR Bollywood Entry: వార్ 2 కంటే ముందుగానే బీ టౌన్‌లోకి తారక్?

Jr NTR Bollywood Entry

ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్ నడుస్తోంది. ప్రతి ఇండస్ట్రీలో డైరెక్టర్స్ తమ సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేసి అందులో సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాటిక్ యూనివర్స్ లో చిన్న చితక సినిమాలు కాకుండా, హై రేంజ్ సినిమాలే వస్తున్నాయి. ఇందులో బాలీవుడ్‌లో వస్తున్న యష్ రాజ్ స్పై యూనివర్స్‌కిి ప్రత్యేక స్థానం ఉంది. పూర్తిగా స్పై జానర్ లో వస్తున్న ఈ యూనివర్స్ సినిమాలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది.

YRF స్పై యూనివర్స్ ని ఇటీవలే అనౌన్స్ చేసినా, 2012లో వచ్చిన ఎక్ ది టైగర్ నుంచి ఇప్పటి వరకు అన్ని సినిమాలను ఈ యూనివర్స్ లోనే కలిపారు. అంతే కాదు, ప్రతి సినిమాకు రాబోయే సినిమాకు లింక్ పెట్టి, ఆడియన్స్ ను ఇంప్రెస్ చేస్తున్నారు. ఈ యూనివర్స్‌లో ఇటీవల వచ్చిన పఠాన్ 1000 కోట్లను వసూళ్లు చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు టైగర్ 3 రిలీజ్ కు సిద్ధంగా ఉండగా.. వార్ 2, టైగర్ Vs పఠాన్ సినిమాలు ఇంకా సెట్స్ పైకి రావాల్సి ఉంది. వార్ 2తో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నట్టు ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. అయితే, తారక్ అభిమానులకు ఈ దీపావళికి YRF స్పై యూనివర్స్ సూపర్ ట్విస్ట్ ఇవ్వబోతుందని సమాచారం.

- Advertisement -

తారక్ బాలీవుడ్ ఎంట్రీ వార్ 2 కంటే ముందే ప్లాన్ చేస్తుందట YRF స్పై యూనివర్స్. ఈ ఏడాది దివాళికి రిలీజ్ కాబోతున్న టైగర్ 3లోనే తారక్ ఎంట్రీ ఉండబోతుందట. ఇటీవల వచ్చిన పఠాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఇచ్చినట్టు… టైగర్ 3లో కూడా తారక్ ఎంట్రీని ఉండేలా ఆదిత్య చోప్రా ప్లాన్ చేస్తున్నాడట. అలాగే టైగర్ 3కి, వార్ 2కిి కూడా లింక్ చేస్తున్నారని ప్రస్తుతం బీ టౌన్ లో టాక్ వినిపిస్తోంది. ఇది నిజమే అయితే, బీ టౌన్ స్క్రీన్ పై తారక్ ఒక సంవత్సరం ముందే కనిపించబోతున్నాడు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు