Tiger Nageswara Rao Trailer Talk: ‘టైగర్’ కథ అక్కడే మొదలైంది..!

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వర రావు పై అభిమానుల్లో ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1970 ల్లో పేరు మోసిన గజదొంగ నాగేశ్వరరావు బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదలైనప్పటినుండే పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి మొన్న వచ్చిన టీజర్ మాస్ మహారాజ్ అభిమానుల్ని ఎంతో ఆకట్టుకుంది. ఇక అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేయడం జరిగింది.

అందరు అనుకున్నట్టుగానే ట్రైలర్ తో రచ్చ చేసేసాడు రవితేజ. ట్రైలర్ లో స్టూవర్టుపురం లో మొదలయ్యే కథగా చూపిస్తూ, అక్కడ ఉన్న దారిదోపిడి చేసే కుటుంబాల్లో ఒకడిగా నాగేశ్వర రావు కనిపిస్తాడు. తన వాళ్ళకి అన్యాయం చేసే ఓ ఊరి పెద్దకి నాగేశ్వరరావు ఎదిరించి నిలబడగా, ఆ ప్రయత్నంలో నాగేశ్వర రావు అనుకోకుండా జైలుకి వెళ్తాడు. అక్కడికి స్టువర్ట్ పురం నాగేశ్వర రావు గా వెళ్లిన వాడు, టైగర్ నాగేశ్వర రావు గా తిరిగొచ్చి ఏం చేసాడన్నదే సినిమా కథ.

ఇక ట్రైలర్ క్వాలిటీ చూస్తుంటే మేకర్స్ ఎక్కడా తగ్గకుండా భారీ వ్యయంతో నిర్మించారని తెలుస్తుంది. ప్రధాన తారాగణంతో సహా, అందరి పాత్రల్లోనూ డిఫరెంట్ వేరియషన్ చూపించాడు దర్శకుడు. ఇక ఈ సినిమాకి జివి ప్రకాష్ అందించిన బీజీఎమ్ మరో ప్లస్ పాయింట్. ట్రైలర్ లో కమర్షియల్ పాళ్ళు ఎక్కువే అయినప్పటికీ స్క్రీన్ ప్లే పరంగా ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని ట్రైలర్ ఇస్తుంది.

- Advertisement -

టైగర్ నాగేశ్వరరావు సినిమాను డైరెక్టర్ వంశీ దర్శకత్వం వహిస్తుండగా, అభిషేక్ పిక్చర్స్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్, రేణు దేశాయ్, నాజర్, జిషు సేన్ గుప్తా, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరరావు వరల్డ్ వైడ్ గా అక్టోబర్20 న రిలీజ్ కానుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు