Bigboss season7: పవర్ అస్త్ర గోవిందా..? పాపం శోభా ఎంత ఫీలవుతుందో?

స్టార్ మా లో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 లో కీలక మలుపు చోటు చేసుకుంది. గత కొన్నాళ్లుగా గెలిచిన వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్న పవర్ అస్త్ర బిగ్ బాస్ లాగేసుకున్నాడు. అసలు విషయానికొస్తే బిగ్ బాస్ సీజన్ 7 అంతా ఉల్టా పల్టాగా సాగుతుందని బిగ్ బాస్ చెప్పినట్టుగానే, ఎంట్రీ ఇచ్చిన వారందరూ హౌస్ మేట్స్ గా కాకుండా కంటెస్టెంట్స్ గా అడుగు పెట్టడం జరిగింది. అంటే వాళ్ళు హౌస్ లో ఉన్నా ఇంటిసభ్యులు కానట్టే.

బిగ్ బాస్ హౌస్ లో కంఫర్మ్ ఇంటి సభ్యులు కావడానికి పవర్ అస్త్ర పొందాల్సిన అవసరం ఉంటుందని బిగ్ బాస్ చెప్పగా, ఇప్పటివరకు అది నలుగురు సాధించగా, అందులో శివాజీ కోల్పోయారు. మిగతా ముగ్గురు సందీప్, శోభా శెట్టి, అలాగే తాజాగా పవర్ అస్త్ర దక్కించుకున్న ప్రశాంత్. అయితే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికి పెద్ద బాంబ్ వేసాడు. ఇప్పటివరకు గెలుచుకున్న పవర్ అస్త్రలను బిగ్ బాస్ వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పేసాడు. ఐదు వారాల ఇమ్మ్యూనిటి కలిగిన పవర్ అస్త్ర ని ఒక బాక్స్ లో పెట్టి ఇచ్చేసారు హౌస్ మేట్స్.

అయితే ఈ ప్రోమో లో పవర్ అస్త్రాలు ఇచ్చేయగానే శివాజి పాట పాడాడు. దానికి శోభా శెట్టి చాలా ఫీలయిపోయిందని తెలుస్తుంది. కొందరుంటారు ఎవరిదైనా ఏమైనా పోతే హ్యాపీ గా ఫీలయ్యే వారు.. ఛీ.. అంటూ నోరు జారింది. అయితే పవర్ అస్త్ర పోయినందుకు ఎంత ఫీలయినా, శోభా శెట్టి నోరుజారడం ఏమి బాగాలేదని ఆడియన్స్ భావిస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు