Bigboss Season7: ఏంటి జడ్జ్ అనగానే ఇంత ఓవర్ చేస్తుంది?

Bigboss Season7:

బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 7 మొదలైనప్పటినుండి టీవీ ఆడియన్స్ సీరియళ్లకు, ప్రోగ్రామ్స్ కి గ్యాప్ ఇచ్చి బిగ్ బాస్ పైనే ఫోకస్ పెట్టేసారు. ఇక ఈ సీజన్ 7 కూడా గతంలో వచ్చిన సీజన్ల మాదిరిగా కాకుండా మంచి ఇంట్రెస్టింగ్ తో ఉల్టా పల్టా గా సాగుతుంది. ఫస్ట్ వీక్ వరకు కొంచెం చప్పగా సాగినా, సెకండ్ వీక్ నామినేషన్ల నుండి ఊపు మీదుంది బిగ్ బాస్ షో. ఇక ఇంతకు ముందు కిరణ్ రాథోడ్, షకీలా ఎలిమినేట్ అవగా, తాజాగా దామిని ఎలిమినేట్ అయింది.

ఇప్పుడు నాలుగోవారం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఆ ప్రాసెస్ లో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్లలో కంఫర్మ్ హౌస్ మేట్స్ అయిన శివాజీ, సందీప్ తో పాటు, లేటెస్ట్ గా కంఫర్మ్ అయిన శోభా శెట్టిలను జడ్జి లుగా బిగ్ బాస్ నియమించారు. ఇక నామినేషన్లలో యావర్ ముందుకు వచ్చి, తేజ, శోభా శెట్టి లను నామినేట్ చేసాడు. లాస్ట్ వీక్ లో పవర్ అస్త్ర కోసం శోభా శెట్టి, ప్రియాంక కలిసి తనను ఓడించారని యావర్ శోభాని నామినేట్ చేస్తుండగా, దానికి శోభా శెట్టి ఒప్పుకోలేదు సరికదా, మళ్ళీ మొండిగా దానికి క్లారిటీ కావాలి అప్పటివరకు తాను సైలెంట్ గా ఉంటానని చెప్పింది.

నిజానికి ఈ పవర్ అస్త్ర విషయంలో ప్రిన్స్ యావర్ కి అన్యాయం జరిగిందని అందరికి తెలుసు. అన్నీ తెలిసి కూడా శోభా శెట్టి నామినేట్ చేయడానికి ఒప్పుకోకపోవడం హాస్యాస్పదంగా అనిపిస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క యావర్ విషయంలోనే కాదు మిగతా కంటెస్టెంట్స్ తో కూడా ఎదో నిజంగా తానే కోర్ట్ లో జడ్జ్ లాగా బిహేవ్ చేస్తుందని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. శోభా శెట్టి ఈ ఓవరాక్టింగ్ ని తగ్గించుకోకపోతే నెక్స్ట్ వీక్ లో ఆడియన్స్ తమ ఓట్లతో అభిప్రాయం చెప్తారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు