బిగ్ బాస్ సీజన్ 7 మూడు వారాలు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుని నాలుగోవారంలోకి ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు కిరణ్ రాథోడ్, షకీలా, దామిని ఎలిమినేట్ అవడం జరిగింది. అయితే ఈ సీజన్లో అందరికంటే పెద్ద సెలబ్రిటీ శివాజీయే కావడం వల్ల అందరు కొంచెం ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నారు. అయితే సీజన్ బిగినింగ్ లో శివాజీ దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో అతి చేస్తున్నాడని కొందరు భావించారు. పైగా స్టార్టింగ్ లో పల్లవి ప్రశాంత్, షకీలా లను మాత్రమే శివాజి ఎంకరేజ్ చేస్తున్నాడని అనుకున్నారు.
కానీ శివాజి టైం కి తగ్గట్టూ మారుతూ బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో పెద్దరికంగా వ్యవహరిస్తున్నాడని తెలుస్తుంది. ఫస్ట్ వీక్ లో పల్లవి ప్రశాంత్ ని సపోర్ట్ చేసిన శివాజీ, సెకండ్ వీక్ లో ప్రిన్స్ ని సపోర్ట్ చేసాడు. అంతే కాదు వాళ్ళని సపోర్ట్ చేయడమే కాకుండా, కొన్ని పరిస్థితుల్లో వాళ్ళ తప్పొప్పుల్ని చూపెడుతూ మెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా బిగ్ బాస్ నామినేషన్ లో యావర్ కంట్రోల్ తప్పి ఆవేశంతో గౌతమ్ తో గొడవకి దిగుతుండగా, అప్రమత్తమైన శివాజీ వెంటనే యావర్ ని తిరిగి తన స్థానానికి వెళ్ళమని గట్టిగా కోపంగా అన్నాడు. అప్పుడే యావర్ వెనక్కి తగ్గాడు.
ఇంతకు ముందు వేరే కంటెస్టెంట్స్ తప్పు చేసినప్పుడు కూడా నిర్మొహమాటంగా శివాజీ వాళ్ళ తప్పులని వేలెత్తి చూపడం జరిగింది. ఇక ఇది చూస్తున్న ఆడియన్స్ కూడా బిగ్ బాస్ లో పర్ఫెక్ట్ గా ఆడుతున్న కంటెస్టెంట్ శివాజీయే అని అంటున్నారు.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the
Read More: Biggboss season 7: ఆటను ఇప్పటికైనా అర్ధం చేసుకుంటారా..?
Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.
బిగ్ బాస్ సీజన్ 7 లో ఫినాలే పవర్ అస్త్ర...
బిగ్ బాస్ సీజన్ 7 లో జరుగుతున్న లాస్ట్...
బిగ్ బాస్ సీజన్ 7 మరో 20 రోజుల్లో ముగుస్తుందన్న...
బిగ్ బాస్ సీజన్ 7 లో సోమవారం నామినేషన్...
స్టార్ మా లో బిగ్ బాస్ సీజన్ 7 లో డబల్ ఎలిమినేషన్...