టాలీవుడ్ టాల్ హీరో గోపీచంద్ చాలాకాలంగా సాలిడ్ హిట్ కోసం కష్టపడుతున్నాడు. హిట్లు, ప్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. గౌతమ్ నంద సినిమా తర్వాత గోపీచంద్ హిట్ అందుకోలేకపోతున్నాడు. రీసెంట్ గా ‘రామబాణం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సత్తా చాటలేకపోయింది.
ఈ మూవీ కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఇప్పుడు గోపీచంద్ నెక్స్ట్ సినిమాపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. అయితే గోపీచంద్ హీరోగా క్రేజ్ తెచ్చుకోకముందే విలన్ గా నటించిన విషయం తెలిసిందే. అయితే గోపీచంద్ హీరోగా దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ మూవీ చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా చాలా గ్రాండ్ గా లాంచ్ అయింది.
Read More: Mark Antony: సూపర్ స్టార్ తో సినిమా తీయకుండా వదలను.. ఎస్.జె.సూర్య!
కాగా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాతో ఈ ఐటమ్ సాంగ్ ని చేయిస్తే బాగుంటుందని మేకర్స్ ఫీల్ అవుతున్నారు. ఊర్వశి రౌతేలా రీసెంట్ గా వరుసగా తెలుగు సినిమాలు చేస్తోంది. మరి గోపీచంద్ సినిమాలో ఊర్వశి రౌతేలా ఎలాంటి ఐటమ్ సాంగ్స్ చేస్తుందో చూడాలి. ఈ మేరకు ఇప్పటికే ఊర్వశితో చర్చలు జరిపిందట చిత్ర బృందం. కాగా వాల్తేరు వీరయ్య, స్కంద సినిమాలలో ఊర్వశి ఐటెం సాంగ్స్ చేసిన సంగతి తెలిసిందే.
For More Updates :
Read More: Vijay Sethupathi : విలన్ కాదా ?
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News
అక్కినేని వారసుడు నాగచైతన్య గురించి తెలుగు...
శృంగార తార షకీల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు...
మాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు హీరో...
చాలామందిలో ఏవో ఒక అనారోగ్య సమస్యలు సర్వసాధారణంగా...
టాలీవుడ్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది...