టాలీవుడ్ లో టాప్ హీరోలతో సినిమాలు తీస్తూ వరుస హిట్లు కొడుతున్న మైత్రి మూవీ మేకర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్నేళ్లుగా ఈ బ్యానర్ లో ఎలాంటి బడా మూవీ వచ్చినా అలా హిట్టైపోతుంది. ముఖ్యంగా సంక్రాంతికి ఇద్దరు సీనియర్ స్టార్స్ సినిమాలు ఒకేసారి రిలీజ్ చేసిన గట్స్ ఉన్న బ్యానర్ ఈ మైత్రి మూవీ మేకర్స్. నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ సీవీ మోహన్ ముగ్గురు కలిసి స్టార్ట్ చేసిన ఈ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో టాలీవుడ్ టాప్ హీరోలందరూ నటించడం విశేషం.
ఇక టాలీవుడ్ లో ఇప్పుడు వస్తున్న పెద్ద సినిమాలు కూడా ఎక్కువగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాలే కావడం గమనార్హం. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, రామ్ చరణ్ బుచ్చిబాబు సాన మూవీ, పుష్ప ది రూల్, ఇలా అన్నీ పెద్ద సినిమాలే లైన్లో ఉన్నాయి. తాజాగా మైత్రి మూవీ నిర్మాణ సంస్థ బాలీవుడ్ లోను సినిమాలు నిర్మించేందుకు సిద్ధమయ్యేట్టు తెలుస్తుంది. బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ తో కలిసి తాజాగా ఓ సినిమా నిర్మిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్.
Read More: రౌడీ హీరో క్రేజీ అప్డేట్
“ఫర్రే” (FARREY) అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా సౌమేంద్ర పడి అనే బాలీవుడ్ దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నాడు. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, ఇంకా సల్మాన్ ఖాన్ సొంత ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ మేనకోడలు అలిజే (ALIZEH) ఈ సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది.
For More Updates :
Read More: baby movie controversy : బేబీ సినిమా కాంట్రావర్సీ పై స్పందించిన విశ్వక్ సేన్
Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది....
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్...
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలీవుడ్ సెన్సేషన్...
పునర్నవి భూపాలం తాజాగా షేర్ చేసిన తన అర్ధ...
టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ స్టార్...