Tollywood: ఇండస్ట్రీ లో ఐటీ దాడుల కలకలం.. లిస్ట్‌లో ప్రముఖులు

టాలీవుడ్ ఇండస్ట్రీ లో గత కొన్నేళ్లుగా పరిస్థితి మారింది. బాహుబలి తర్వాత పెద్ద పెద్ద సినిమాలు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ఈ మధ్య వచ్చిన సైరా, సాహో, రాధేశ్యామ్, RRR, పుష్ప సినిమాలు భారీ బడ్జెట్ లతో తెరకెక్కించినవే. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లోనే పెద్ద హీరోల సినిమాలు, డైరెక్టర్ల సినిమాలు తెరకెక్కుతున్నాయి. అవి హిట్ అయినా, ప్లాప్ అయినా బడ్జెట్ మాత్రం భారీ గా ఉంటుంది. అయితే ఆ సినిమాలు హిట్ అయితే లాభాలు కూడా భారీ గానే వస్తాయి. బాహుబలి చిత్రం ద్వారా ఆ ప్రొడ్యూసర్లకే కాకుండా హీరో, డైరెక్టర్ లకి కూడా 100 కోట్లకి పైగా లాభాన్ని పొందారు. రీసెంట్ గా వచ్చిన rrr కి కూడా అదే జరిగింది.

అయితే ఇలా వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీయడం వల్ల ప్రొడ్యూసర్స్ కి, ఆ సినిమా లో భాగమైన వారికి కొన్ని చిక్కులు కూడా వస్తున్నాయి. సినిమా ద్వారా వచ్చే లాభాల్లో, పన్ను ని సరైన పద్ధతి లో ప్రభుత్వానికి చెల్లించకపోతే, గవర్నమెంట్ నుంచి అప్పుడపుడు రైడ్ లు కూడా జరుగుతాయి. అప్పట్లో దిల్ రాజు, అల్లు అరవింద్ ల స్టూడియో ల్లో జరిగిన ఐటీ దాడుల గురించి తెలిసిందే. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా వచ్చిన టైమ్ లో నిర్మాత దిల్ రాజు ఐటీ వాళ్ళకి లెక్కలు చెప్పడానికి ఎంతో ఇబ్బంది పడ్డాడు. ఇక తాజాగా మరోసారి ఇండస్ట్రీ లో ఐటీ దాడులు జరిగాయి.

టాలీవుడ్ లో ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్  నిర్మాతలైన నవీన్ యెర్నేని, రవి శంకర్, మోహన్ చెరుకూరి ల ఇళ్లల్లో ఐటీ ఆఫీసర్లు దాడులు జరిపారని సమాచారం. అంతే కాదు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఆఫీస్, ఇంట్లో కూడా ఐటీ వాళ్ళు తనిఖీ లు చేశారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

- Advertisement -

అయితే మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప ది రైజ్ మూవీ ని సుకుమార్ డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. 2021 డిసెంబర్ లో విడుదలైన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి భారీ లాభాల్ని సొంతం చేసుకుంది. దాదాపు 370 కోట్లకి పైగా వసూలు చేసింది. అయితే ఇప్పుడు మళ్ళీ పుష్ప 2 తో రాబోతున్నారు. ఈ సినిమా కి దాదాపు 400 కోట్ల దాకా బిజినెస్ జరగొచ్చని టాక్. అందువల్ల వీరిపై అకస్మాత్తుగా ఐటీ ఆఫీసర్లు దాడి చేయడం జరిగింది. ఈ ఐటీ ఆఫీసర్లు ఢిల్లీ నుంచి దిగారని, మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ సుకుమార్ ల దగ్గరే కాకుండా, ఇండస్ట్రీ లోని బడా ప్రొడ్యూసర్స్ ఇళ్లల్లో కూడా దాడులు జరుపుతున్నారని సినీ వర్గాల సమాచారం.

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు