Jayam Ravi New Movie: ‘దేవుడి’కి A సర్టిఫికేట్

Jayam Ravi New Movie

కోలీవుడ్ స్టార్ జయం రవి సినిమాకి ఫస్ట్ టైం A సర్టిఫికెట్ వచ్చింది. జయం రవి ఏంటి.. ! ‘ఏ’ సర్టిఫికెట్ సినిమాలు చేయడమేంటి అని షాక్ అవుతున్నారా? నిజంగానే ‘ఏ’ సర్టిఫికెట్ సినిమా చేసాడు.. కానీ అది మీరు ఊహించిన సినిమా కాదు. అది ఒక హర్రర్ కాన్సెప్ట్ మూవీ. మామూలుగా హర్రర్ నేపథ్యమున్న సినిమాలు చాలా మంది చేసినప్పటికీ జయం రవి నటించిన ఈ సినిమా మాత్రం హర్రర్ మూవీ లవర్స్ కి ఇంట్రెస్టింగ్ ని కలగచేసింది.

సినిమా విషయానికొస్తే గతంలో వచ్చిన కోలీవుడ్ మూవీ “రట్సాసన్” మూవీ తరహాలో ఈ సినిమా కథ ఉంటుంది. ఆ సినిమా తెలుగులో రాక్షసుడు పేరుతో తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహా కథతో అమ్మాయిల మిస్సింగ్ మర్డర్స్ నేపథ్యంలో తెరకెక్కిన జయం రవి సినిమా “ఇరైవన్”. తెలుగులో “గాడ్” పేరుతో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా మెప్పించగా, తాజాగా సెన్సార్ బోర్డు నుండి క్లీన్ A సర్టిఫికెట్ ని సొంతం చేసుకుంది “గాడ్” మూవీ.

- Advertisement -

ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా జయం రవి మాట్లాడుతూ, తాను నటించిన సినిమాల్లో ఫస్ట్ టైం ఒక సినిమాకి A సర్టిఫికెట్ రావడం అని చెప్తూ, ఈ సినిమాని చిన్న పిల్లలు అస్సలు చూడకండి, అని అడ్వైస్ కూడా చేసాడు. ఇక “గాడ్” సినిమా సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ అవుతుంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు