Venkatesh: ‘సైంధవ్’ టీజర్ ఆరోజే ఉండనుందా?

Venkatesh:

టాలీవుడ్ లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో మూవీస్ లో “సైంధవ్” ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న ఆ సినిమాపై దగ్గుపాటి అభిమానులే కాదు కామన్ ఆడియన్స్ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. శైలేష్ కొలను దర్శకత్వం లో వస్తున్న సినిమా కావడం, పైగా సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో వస్తుండడంతో ట్రేడ్ విశ్లేషకులు కూడా సినిమా స్క్రిప్ట్ చాలా బాగుంటుందని అంటున్నారు. దీనికి తోడు సినిమా ఫస్ట్ లుక్ కూడా ఓ రేంజ్ లో ఉంది. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు వెంకటేష్ చెప్పిన డైలాగ్స్ ఓ రేంజ్ లో పేలాయి.

వెంకటేష్ చాలా కాలం తర్వాత తన స్థాయికి తగ్గ సినిమా చేస్తున్నాడని చాలా మంది అభిప్రాయం. ఇక “సైంధవ్” సినిమా నుండి వచ్చే ప్రతి అప్డేట్ కూడా హైప్ పెంచుతూనే ఉంది. అయితే తాజాగా ఓ స్ట్రాంగ్ బజ్ సైంధవ్ గురించి సోషల్ మీడియా లో మొదలైంది. అదే టీజర్ అప్డేట్..
“సైంధవ్” రిలీజ్ కి ఇంకా నెలలే సమయం ఉన్నా ఇంకా టీజర్ రిలీజ్ కాకపోవడం ఆశ్యర్యంగా ఉంది. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం “సైంధవ్” యొక్క టీజర్ ని దసరా సందర్బంగా రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తుంది.

సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయినట్టే తెలుస్తుంది. పైగా డబ్బింగ్ పనులు కూడా మొదలయ్యాయి. ఇక ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు, నవాజుద్దీన్ సిద్ధికి, ఆండ్రియా, శ్రద్ధ శ్రీనాథ్, రుహాణి శర్మ, బేబీ సారా కీలకపాత్రల్లో నటించారు. సైంధవ్ సినిమా కి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతున్న సైంధవ్ సినిమాను డిసెంబర్ 22న క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు