Raviteja: స్మూత్ గా హైపెక్కించేస్తున్న నాగేశ్వరరావు!

Raviteja Tiger Nageswararao:

టాలీవుడ్ లో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. బడా హీరోల నుండి సీనియర్ హీరోల దాకా, మీడియం హీరోల నుండి చిన్న హీరోల దాకా అందరూ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. అందులో మాస్ మహారాజ్ రవితేజ కూడా భాగమయ్యాడు. రవితేజ హీరోగా “టైగర్ నాగేశ్వర రావు” బయోపిక్ సినిమాలో నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. 70ల్లో పేరు మోసిన గజదొంగ నాగేశ్వర రావు జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

మెగాస్టార్ చిరంజీవి చేత గ్రాండ్ ఓపెనింగ్ కూడా జరగగా, రవితేజ వేరే సినిమాల వల్ల రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవడానికి చాలా టైం తీసుకుంది. ఈ గ్యాప్ లో చాలా మంది ఈ సినిమా గురించి మర్చిపోయారు. కానీ ఎప్పుడైతే మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారో అప్పట్నుంచి సినిమాపై మళ్ళీ బజ్ ఏర్పడింది. ఇక టీజర్ రిలీజ్ కి టైం దగ్గర పడుతుండడంతో సినిమాపై క్రేజ్ రావడానికి టీజర్ రిలీజ్ కి ముందే హైప్ ఎక్కించే ప్రయత్నంలో ఉన్నారు మేకర్స్.

దానికి కొనసాగింపుగా చిత్ర యూనిట్ ఆ సినిమాలోని ఒక్కొక్క క్యారెక్టర్స్ ని రివీల్ చేస్తూ వారి ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రిలీజ్ చేస్తున్నారు. ఆ పోస్టర్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. దీంతో సినిమాపై మెల్లిగా క్రేజ్ పెరిగిపోతుంది. నిన్న అనుపమ్ ఖేర్(రాఘవేంద్ర రాజపుత్ IB ఆఫీసర్) ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా, ఈరోజు మురళీశర్మ(DSP క్రైమ్ బ్రాంచ్) రోల్ ని రివీల్ చేసారు. ఇక జిషు సేన్ గుప్తా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసే అవకాశం ఉంది.

- Advertisement -

ఇక ఈ సినిమా టీజర్ ఆగష్టు 17న రిలీజ్ చేయనున్నారు. టైగర్ నాగేశ్వరరావు సినిమాను డైరెక్టర్ వంశీ దర్శకత్వం వహిస్తుండగా, అభిషేక్ పిక్చర్స్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 20న విడుదల చేయనున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు