Dasara Race: మాస్ మహారాజ్ మరోసారి బాలయ్యని ఓడిస్తాడా?

Ravi Teja and Balakrishna in Dussehra Race

టాలీవుడ్ లో సినిమాల పోటీ అనేది చాలా కామన్. పోటీ పడినప్పుడే ఒక హీరో సత్తా అనేది బయటపడుతుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతికి గాని, దసరా కి గాని పోటీ పాడడం చాలా కామన్. ఈ లాంటి సినిమాల పోటీ బాలయ్యకి చాలా కామన్. గత 30ఏళ్లుగా బాలయ్య సినిమాలు ఎప్పుడొచ్చినా సంక్రాంతికి లేదా దసరా కి వస్తున్నాయి. ఇక మరో సీనియర్ స్టార్ రవితేజ కూడా తక్కువేమి కాదు.

రవితేజ కూడా చాలా సార్లు సంక్రాంతికి దసరా కి పలువురు హీరోలతో పోటీపడ్డారు. వీరిలో బాలకృష్ణ కూడా ఒకరు. అవును.. నందమూరి బాలకృష్ణ, మాస్ మహారాజ్ రవితేజ దాదాపు 7సార్లకి పైగా పోటీపడ్డారు. 2003లో జూన్ లో వారం రోజుల గ్యాప్ తో బాలకృష్ణ పల్నాటి బ్రహ్మనాయుడుగా వస్తే, రవితేజ ఒక రాజు ఒక రాణి సినిమాతో వచ్చాడు. ఈ రెండింటిలో బాలయ్య సినిమా డిజాస్టర్ అయితే రవితేజ సినిమా యావరేజ్ గా ఆడింది.

ఇక ఆ తరువాత 2005 దసరా పోటీలో కూడా బాలకృష్ణ అల్లరి పిడుగు గా వస్తే, రవితేజ భగీరథ గా వచ్చాడు. ఈ ఏడాది కూడా బాలయ్య సినిమా ప్లాప్ అవగా, రవితేజ సినిమా యావరేజ్ గా ఆడింది. ఇక 2008 సంక్రాంతికి బాలకృష్ణ ఒక్క మగాడు తో రాగా, రవితేజ కృష్ణ గా వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాడు. బాలకృష్ణ ఒక్క మగాడు డిజాస్టర్ అయింది. 2009 లో సమ్మర్ బరిలో బాలకృష్ణ మిత్రుడు సినిమాతో ఆడియన్స్ ని పలకరించగా ప్లాప్ ని అందుకున్నాడు. వారం గ్యాప్ లో రవితేజ “కిక్” తో వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాడు.

- Advertisement -

ఇక 2011 లో సంక్రాంతికి బాలకృష్ణ పరమ వీరచక్ర తో, రవితేజ మిరపకాయ్ తో వచ్చి, ఇప్పుడు కూడా రవితేజే సూపర్ హిట్ కొట్టాడు. ఇక 2012 సమ్మర్ లో రవితేజ దరువుతో బాలకృష్ణ అధినాయకుడుతో వచ్చి ఇద్దరు బోల్తా పడ్డారు. చివరగా వీళ్లిద్దరు ఈ సంవత్సరం పోటీపడ్డారు. వీర సింహారెడ్డి గా బాలయ్య సూపర్ హిట్ కొట్టగా, వాల్తేరు వీరయ్య లో స్పెషల్ రోల్ లో వచ్చి రవితేజ బ్లాక్ బస్టర్ కొట్టాడు.

ఓవరాల్ గా ఏడు సార్లు పోటీపడితే రవితేజ 5 సార్లు 1సారి విన్ అయ్యాడు. ఒకసారి ఇద్దరు ప్లాప్ అందుకున్నారు. ఇక ఇప్పడు 8వ సారి భారీ సినిమాలతో పోటీపడుతున్నారు. బాలకృష్ణ భగవంత్ కేసరిగా అక్టోబర్19 న వస్తుంటే, ఒకరోజు గ్యాప్ తో అక్టోబర్ 20న రవితేజ “టైగర్ నాగేశ్వరరావు” గా ఆడియన్స్ ని పలకరించనున్నాడు. మరి ఈ సారి ఏ హీరో దసరా బరిలో విజయం సాధిస్తారో చూడాలి. హైప్ విషయానికొస్తే రెండు సినిమాలకు వాటికీ తగ్గట్టు క్రేజ్ ఉంది. ఇక రిలీజ్ సమయంలోనే ఈ సినిమాల అసలు లెక్క ఏంటో తెలుస్తుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు