Karthik Subbaraj comments viral: కార్తీక్ సుబ్బరాజ్ డ్రీం హీరో అతనే.. ?

Karthik Subbaraj comments viral on internet

తమిళ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తన మనుసులోని మాటను బయట పెట్టాడు. ఆ హీరోతో వర్క్ చేయడమే తన డ్రీం అంటూ చెప్పగా ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. రజినీకాంత్ లాంటి స్టార్ హీరో వర్క్ చేసిన అనుభవం ఉన్న ఈ డైరెక్టర్ రజినీ పేరు కాకుండా మరో హీరో పేరు చెప్పడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దలకొండ గణేష్ సినిమా గురించి అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా తమిళ్ లో సూపర్ హిట్టైన జిగర్తాండ సినిమాకు రీమేక్. సిద్దార్థ్, బాబీ సింహ, లక్ష్మి మీనన్ ప్రధాన పాత్రలలో నటించిన జిగర్తాండ సినిమా కార్తీక్ సుబ్బరాజు ను తమిళ్ లో స్టార్ డైరెక్టర్ హోదాలో నిలబెట్టింది.

రజినీకాంత్ తో పేట సినిమా, చియాన్ విక్రమ్ తో మహాన్, ధనుష్ తో జగమే తంత్రం సినిమాలను డైరెక్ట్ చేసిన ఈ దర్శకుడి డ్రీం హీరో మాత్రం వీళ్ళెవరూ కాకుండా వేరే ఒకతను ఉన్నాడట . అయితే అతను మరెవరో కాదు తలపతి విజయ్. కోలీవుడ్ లో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తలపతి విజయ్ తో ఆయన కెరీర్ లోనే గుర్తుండిపోయే సినిమాను చేయడమే కార్తీక్ సుబ్బరాజ్ డ్రీం అని ఆయన ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపారు.

- Advertisement -

ప్రస్తుతం జిగర్తాండ సినిమాకు సీక్వెల్ గా జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమాను తెరకెక్కిస్తున్న ఈయన. ఈ సినిమా అనంతరం విజయ్ కు స్టోరీ చెప్పి ఆయనతో సినిమాచేస్తానని చెప్పాడు. అయితే ఇందులో ఒక చిక్కు ఉంది. అదేంటంటే తలపతి విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తరువాత ఆయన సినిమాలకు స్వస్తి చెప్పి, పాలిటిక్స్ కు వెళ్తాడని ఒక రూమర్ కోలీవుడ్ మీడియాలో గట్టిగ వినిపిస్తోంది. మరీ కార్తీక్ సుబ్బరాజ్ తో విజయ్ సినిమా చేయడానికి ఎలా ఒప్పుకుంటాడనేది ప్రశ్నార్థకంగా మారింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు