BRO: సింగల్ లాంగ్వేజ్ లో 100కోట్ల హ్యాట్రిక్…

Bro movie crossed 100 crores

టాలీవుడ్ హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోలందు పవర్ స్టార్ వేరయా అన్నట్టు.. ఉంటాడు. పవన్ కళ్యాణ్ సినిమాలు ఎప్పుడొచ్చినా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించడం ఖాయం. ఒక్కోసారి సినిమా రొటీన్ గా ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ సినిమాలకి ఓపెనింగ్స్ వస్తాయి. గతంలో వచ్చిన కాటమరాయుడుకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ 60కోట్లకి పైగా వసూలు చేసి నిర్మాతని సేఫ్ జోన్ లో పడేసింది.

ఇక తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన మరో సినిమా యావరేజ్ టాక్ తెచుకున్నప్పటికీ భారీ కలెక్షన్లను సాధించింది. పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన “బ్రో” సినిమాకి ఆడియన్స్ లో డీసెంట్ రెస్పాన్స్ ని తెచ్చుకుంది. జులై28న రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే నుండే మామూలు కలెక్షన్స్ ని వసూలు చేసింది. ఇక తాజాగా “బ్రో” సినిమా 100కోట్ల క్లబ్ లో జాయిన్ అయిపోయింది. అయితే మూడవ రోజునే ఈ ఫీట్ ని సాధించాల్సి ఉండగా, వర్షాల ప్రభావం వలన ఈ సినిమాకి దెబ్బపడింది. అయినా 5రోజుల్లో 100కోట్లు దాటేసింది.

ఇక బ్రో సినిమాతో పవన్ కళ్యాణ్ వరుసగా మూడో సారి 100కోట్ల క్లబ్ లో జాయిన్ అవడం జరిగింది. 2021 లో వకీల్ సాబ్ తో మొదటి ఈ ఫీట్ సాధించగా, ఆ తరువాత భీమ్లా నాయక్ గా రెండో సారి, ఇప్పుడు “బ్రో” తో మూడో సారి ఈ ఫీట్ ని సాధించాడు. ఇక బ్రో సినిమా ఎండ్ అయ్యే సరికి మరో 20కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు