#WolfTeaser update : ట్రోలింగ్ కు గురవుతున్న ప్రభుదేవా కొత్త సినిమా

Wolf movie Teaser update

సినిమాల అప్డేట్ విషయంలో మేకర్స్ ఎప్పటికప్పుడు జాగ్రత్త వహిస్తున్న కూడా ఏదో ఒక తప్పు జరుగుతునే ఉంటుంది. అలాంటిది ఎం పట్టనట్టు ఏమరపాటుగా ఉంటె మాత్రం అప్పుడు జరిగే తప్పులు అస్సలు సరిదిద్దుకొని లేము. పైగా అందరి చేత మాటలు కూడా పడాల్సి వస్తుంది. అయితే ఇలాంటి ఒక విపత్కర పరిస్థితినే ఒక పాన్ ఇండియన్ సినిమా ఎదుర్కొంటుంది.

ప్రభుదేవా హీరోగా, విను వెంక‌టేష్ ద‌ర్శ‌క‌త్వంలో వూల్ప్ అనే పాన్ ఇండియా సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. అయితే ఈ సినిమా టైటిల్ వూల్ప్ కాగా తెలుగులో రిలీజ్ చేసిన పోస్టర్ లో వుల్ప అని పడింది. అయితే ఇంగ్లీష్ లో మాత్రం వూల్ప్ అని ఉండి, తెలుగులో వుల్ప అని ఉండేసరికి ఈ సినిమా టైటిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్ కు గురవుతుంది. వుల్ప అనే పదం తెలుగు రాష్టాలలో బూతు అవడంతో ఇక దీన్ని పట్టుకొని మిమర్స్ అంత ఇదేం టైటిల్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

అయితే ఇది గమనించిన మూవీ టీం వెంటనే ఆ పోస్టర్ ను తొలగించి ఉ ల్ఫ్వు పేరుతో మరో పోస్టర్ అప్డేట్ చేసింది. కానీ అప్పటికే మొదటి పోస్టర్ ఇంటర్నెట్ లో వైరల్ అవడంతో ఈ సినిమాకు ట్రోలింగ్ తప్పట్లేదు. మిస్టరీ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఆగస్ట్ 3న రిలీజ్ చేయబోతున్నట్టు మూవీ యూనిట్ పోస్టర్ లో తెలిపారు. ఇక ఈ సినిమాలో ప్రభుదేవా సరసన లక్ష్మి రాయ్ హీరోయిన్ గా నటిస్తోంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు