Tollywood vs kollywood : చిరంజీవి, బాలకృష్ణ కు బుద్ది చెప్పిన రజినీకాంత్

Tollywood vs kollywood

సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ సినిమా జైలర్ ఇటీవలనే థియేటర్స్ రిలీజై, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ జైలర్ సినిమాలో రజినీకాంత్ చాలా రోజుల తరువాత కొత్తగా కనిపించటంతో ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ అందుకుంటుంటుంది.

అయితే జైలర్ సినిమా రిలీజ్ కు ఒక రోజు తేడాతో రిలీజైన మెగా స్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా కూడా రిలీజ్ అయ్యింది.కానీ భోళా శంకర్ సినిమా రీమేక్ సినిమా అవడం, అలాగే కథ, కథనంలో తీవ్ర లోపాలుండటంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది . ప్రస్తుతం డిజాస్టర్ దిశగా పరుగులు తీస్తున్న భోళా శంకర్ సినిమాకు తీసినందుకు గాను మెగా స్టార్ చిరంజీవి పై కూడా తీవ్రంగా నెగిటివిటీ వస్తుంది.

అయితే భోళా శంకర్ సినిమా రిజల్ట్ ఇలాగా ఉన్నందున జైలర్ సినిమాకు మరింత ప్లస్ అయిందని చెప్పాలి. ప్రస్తుతం 300 వందల కోట్ల గ్రాస్ తో కోలీవుడ్ లో టాప్ ప్లేస్ లో మరియు టాలీవుడ్ లోను మంచి కలెక్షన్స్ దూసుకుపోతున్న జైలర్ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అంశాలేవీ అని చూస్తే ఈ క్రింది విధంగా తెలుస్తోంది.

- Advertisement -

జైలర్ సినిమాలో  రజినీకాంత్ ఒక 35 ఏళ్ళు వయసున్న ఒక పోలీస్ ఆఫీసర్ కు తండ్రిగా నటించాడు. ఆయన గత సినిమాలోగా హీరోయిన్స్ తో రొమాన్స్ చేయడం, లవ్ ట్రాక్ లాంటివి ఏమి లేకుండా ఒక ఫ్యామిలీ పర్సన్ గా, యాక్టింగ్ కు అవకాశమున్న ఒక మంచి పాత్రలో నటించాడు. అలాగే కోలీవుడ్ మరో స్టార్ నటుడు కమల్ హాసన్ విషయానికొస్తే ఆయన కూడా తన గత చిత్రం విక్రమ్ సినిమాలో ఇటువంటి పాత్రలోనే కనిపించాడు.

కానీ టాలీవుడ్ సీనియర్ స్టార్ నటుల విషయానికొస్తే ఎంత సేపు గాల్లో ఎగిరిపడే ఫైట్స్, యంగ్ హీరోయిన్స్ తో రొమాన్స్.. ఇవి తప్ప కథ, కథనం గురించి పెద్ద పట్టించుకోవడం లేదు. అందుకే ఈ హీరోల సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. ఇక రీసెంట్ గా బాలయ్య నటించిన గత చిత్రం వీరసింహరెడ్డి.. ఈ ధోరణికి పరాకాష్ట అనే చెప్పాలి. ఆ సినిమాలో బాలయ్య శృతి హాసన్ తో నడిపిన లవ్ స్టోరీకి థియేటర్స్ లో ప్రేక్షకులు మొహం చాటేసిన విషయం అందరికి తెలిసిందే.

ఇక వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాల పరిస్థితి కూడా ఇంచుమించుగా అంతే. చిరంజీవి ఉన్నరేంజ్ కు, ఆయనకున్నయాక్టింగ్ పొటెన్షియాలిటీకి జబర్దస్త్ యాంకర్ రష్మీ తో రొమాన్స్ చేయడం థియేటర్స్ లో మెగా ఫ్యాన్స్ ను చాలా ఇబ్బంది పెట్టింది. ఇక ఈ రెండు అంశాలను కామన్ గా పెట్టుకొని ప్రస్తుతం సోషల్ మీడియాలో కోలీవుడ్ సీనియర్ యాక్టర్స్ వర్సెస్ టాలీవుడ్ సీనియర్స్ యాక్టర్స్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇకనైన చిరంజీవి, బాలకృష్ణ ఈ విషయాలపై ఆలోచించి కంటెంట్ ప్లస్ ఏజ్ ను మైండ్ లో పెట్టుకొని సినిమాలు చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు