NTR in War2: వార్ 2 కోసం ఎన్టీఆర్ స్పెషల్ కేర్..!

NTR in War2

హృతిక్ రోషన్ నటిస్తున్న వార్2 సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేవర షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్, ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక జనవరిలో అమెరికా, లేదా దుబాయ్ వెళ్లి స్పెషల్ ట్రైనర్స్ సమక్షంలో బాడీ బిల్డింగ్ మీద దృష్టి పెట్టనున్నాడట.

వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ కి ధీటుగా ఎన్టీఆర్ కనిపించేలా ప్లాన్  చేస్తున్నారట మేకర్స్. పెద్ద పెద్ద గన్స్ తో రూపొందించబోయే యాక్షన్ సీక్వెన్స్ లో కండలు తిరిగిన బాడీతో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కనిపించనున్నారని సమాచారం.ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ లో కనిపించనున్నాడని టాక్ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వినిపిస్తున్న వార్త సినిమాపై అంచనాలు పెంచుతోంది.

ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న దేవర సినిమా షూటింగ్ నవంబర్ లో కంప్లీట్ అవుతుందని సమాచారం ఉండగా, ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని వార్2 సినిమా కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాడని తెలుస్తోంది. దేవర సినిమాలో దాదాపు 30శాతం వరకు సీజీ వర్క్ ఉంటుందని, ఇందుకోసం హాలీవుడ్ సినిమాలకు పని చేసే ఒక ప్రముఖ వీఎఫెక్స్ కంపెనీని సంప్రదించారట మేకర్స్.

- Advertisement -

ఆచార్య ద్వారా ఘోర డిజాస్టర్ అందుకున్న కొరటాల దేవర సినిమాతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలన్న కసితో ఉన్నట్లు తెలుస్తోంది. దేవర సినిమాలో ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ మధ్య యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ గా నిలుస్తుందని, ఇందుకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయ్యిందని సమాచారం అందుతోంది. ఏప్రిల్ 5న రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్న ఈ సినిమా ద్వారా డైరెక్టర్ కొరటాల కమ్ బ్యాక్ ఇస్తాడా లేదా చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు