War2: ఆ స్టార్ హీరో ఎన్టీఆర్ ని తొక్కేయడానికి చూస్తున్నాడా..?

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. తాత వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్.

ఇక ఇటీవల జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఆయన ప్రతిభ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏ పాత్రలోనైనా నూటికి నూరుశాతం న్యాయం చేయగలిగే ఏకైక నటుడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం హాలీవుడ్ డైరెక్టర్లు సైతం తారక్ తో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఇటువంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ని తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నాడట ఓ టాలీవుడ్ స్టార్ హీరో. ఎన్టీఆర్ అంటే గిట్టని ఆ హీరో ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టడం ఇష్టం లేక ఆయనపై నెగిటివ్ గా ప్రచారం చేయిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ కి సంబంధించి బ్యాడ్ ట్రోలింగ్ చేయిస్తున్నరన్న న్యూస్ వైరల్ గా మారింది. ఇందుకు తగ్గట్టే ఇటీవల బాలీవుడ్ సెన్సార్ బోర్డు మెంబర్ అని చెప్పుకు తిరిగే ఉమైర్ సైంధూ సైతం ఎన్టీఆర్ కి ఓ హీరోయిన్ తో ఎఫైర్ ఉందంటూ సంచలన విమర్శలు చేశారు.

- Advertisement -

అయితే ఎన్టీఆర్ అంటే గిట్టని ఆ హీరో ఇతడితో ఇలా ట్వీట్ చేయించాడని.. ఎన్టీఆర్ ని బాలీవుడ్ లో అడుగు పెట్టకుండా చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఓ వార్త పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ అభిమానులు ఉమైర్ సైంధూ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు