Akhanda2 :బాలకృష్ణ సినిమాపై ప్రభుత్వం బ్యాన్..?

నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు వింటేనే అభిమానులలో పూనకాలు వస్తాయి. బాలకృష్ణ అంటే ఆయన అభిమానులకు ఎనలేని ప్రేమ. ఆయన తిట్టినా సరే.. కొట్టినా సరే..ఆయనంటే పడి చస్తారు. ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీకి అభిమానులు బ్రహ్మరథం పడతారు. సందర్భం ఏదైన, సినిమా ఏదైన “జై బాలయ్య” అంటూ ఆయనపై ఉన్న ప్రేమని, ఆప్యాయతని తెలియజేస్తూ ఉంటారు.

14 ఏళ్ల వయసులోనే ముఖానికి రంగు వేసుకున్న బాలకృష్ణ.. దాదాపు 50 సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. బాలయ్యకు ఉన్న మాస్ ఫాలోయింగ్ తెలుగులో మరే హీరోకు లేదంటే నమ్మలేరు. ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి, ఎన్నో సూపర్ హిట్ లు అందుకున్నారు బాలకృష్ణ. అలాంటి బాలకృష్ణ నటించిన ఒక సినిమాని ప్రభుత్వం బ్యాన్ చేసిందట.

ఆ సినిమా ఏదంటే..? బాలకృష్ణ 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే “తాతమ్మకల” అనే సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకి సీనియర్ ఎన్టీఆర్ స్వయంగా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో భానుమతి హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ, సాయిబాబు, చలపతిరావు కీలక పాత్రలలో నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో కుటుంబ నియంత్రణపై విస్తృతమైన ప్రచారం సాగుతుంది. “ఇద్దరు ముద్దు.. ముగ్గురు వద్దు” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేస్తూ వస్తోంది.

- Advertisement -

ఈ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో కుటుంబ నియంత్రణను వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్.. భానుమతి పాత్రలో కొన్ని డైలాగులను చెప్పించారు. దీంతో ప్రభుత్వం ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సినిమాను ఏకంగా రెండు నెలల పాటు బ్యాన్ చేసింది. ఆ తర్వాత మూవీ యూనిట్ ఈ సినిమాలో కొన్ని మార్పులు చేయడంతో ఈ చిత్రాన్ని 1975 జనవరి 8న విడుదల చేశారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు