Devara : జూనియర్ ఎన్టీఆర్ పెళ్లికి ముందే ఆ హీరోయిన్ ని పిచ్చిగా ప్రేమించాడా.?

తాత నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని స్టార్ హీరోగా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాల నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. “నిన్ను చూడాలని” అనే సినిమాతో హీరోగా మారారు. ఇక ఇటీవల దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా కూడా మారిపోయారు.

అయితే జూనియర్ ఎన్టీఆర్ 2011వ సంవత్సరంలో లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. లక్ష్మీ ప్రణతి మరెవరో కాదు చంద్రబాబు నాయుడు మేనకోడలు కూతురు. అయితే ఏ అబ్బాయి జీవితంలోనైనా పెళ్లి కాకముందు ఓ లవర్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అలా జూనియర్ ఎన్టీఆర్ జీవితంలో కూడా ఒక అమ్మాయి ఉందట. ఆమె మరెవరో కాదు సమీరారెడ్డి.

అశోక్, నరసింహుడు అనే చిత్రాలలో ఎన్టీఆర్, సమీరా రెడ్డి కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాల సమయంలోనే ఎన్టీఆర్ – సమీరారెడ్డి తో ప్రేమలో పడ్డారని అప్పట్లో అనేక వార్తలు వినిపించాయి. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని రూమర్స్ కూడా వచ్చాయి. కానీ సమీరా రెడ్డి ఇతర చిత్రాలలో నటిస్తూ ఎక్కువగా ఎక్స్పోజింగ్ చేయడం జూనియర్ ఎన్టీఆర్ కి నచ్చేది కాదట. దీంతో తన సినిమాలతో తప్ప వేరే సినిమాలలో నటించకూడదని ఎన్టీఆర్ ఆమెకి ఓ కండిషన్ పెట్టారట.

- Advertisement -

ఆ తరువాత వీరి ప్రేమ గురించి ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణకి తెలియడంతో సమీరా రెడ్డి కుటుంబం దగ్గరికి వెళ్లి వార్నింగ్ ఇచ్చారట హరికృష్ణ. ఈ కారణంగానే వీరిద్దరూ విడిపోయారని, ఆమె నుంచి దూరమైన తర్వాత ఎన్టీఆర్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారని సినీ విశ్లేషకులు అంటున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో ఎన్టీఆర్ తనకు సమీరారెడ్డి పై క్రష్ ఉంది, ప్రేమ మాత్రం కాదని చెప్పే ప్రయత్నం చేశారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు