Thaman: సాంగ్ లీక్ చేసి , రెస్పాన్స్ ను బట్టి ఒరిజినల్ వదులుదాం

 

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కాలం మారుతున్న కొద్దీ చాలా మార్పులు జరుగుతూ వచ్చాయి. ఒకప్పుడు సినిమా రిలీజ్ కంటే ముందు ఆడియో క్యాసెట్స్ వచ్చేవి. తర్వాత తర్వాత అవి కాస్త వీసీడీలు రూపంలో రిలీజ్ అవ్వటం మొదలయ్యాయి. ఆ తర్వాత డైరెక్ట్ గా ఇంటర్నెట్ లో సాంగ్స్ అవైలబుల్ గా ఉండేవి. మొబైల్స్ వచ్చిన తర్వాత ఈ డీవీడీలు, క్యాసెట్స్ కొనడం మానేసి మొబైల్ లో పాటలు వింటూ రిలీజ్ వరకు వెయిట్ చేసేవాళ్ళు.

Read More:SS Thaman: కంటెంట్ బాగుంటే కింగ్ సినిమాలో “జై సూర్య” కూడా బాగా కొడతాడు

- Advertisement -

ఇప్పుడు ప్రతి సినిమా నుంచి అన్ని పాటలు ఒకేసారి కాకుండా, ఒక్కొక్కసారి ఒక్కొక్క పాటను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. దానికి లిరికల్ వీడియో అని ఒక పేరుని కూడా పెట్టారు. సినిమా రిలీజ్ దగ్గరలో ఉంది అంటే ఒకదాని తర్వాత ఒక సాంగ్ ని సినిమా రిలీజ్ కంటే కొన్ని రోజులు ముందు నుంచి సాంగ్స్ రిలీజ్ చేయటం మొదలుపెడుతూ వచ్చారు. ఈ ట్రెండ్ అనేది ఈ మధ్య కొనసాగుతుంది. అయితే ఏ సినిమా నుంచి అయినా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసినా కూడా ఆ అప్డేట్ ఇవ్వడానికి కూడా ఒక అప్డేట్ ఇవ్వడం మొదలుపెట్టారు.

ప్రస్తుతం చాలామంది వెయిట్ చేస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. కానీ ఈ సినిమా నుంచి ఒక పాట కూడా ఇప్పటివరకు బయటకు రాలేదు. అయితే ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఒక సాంగ్ లీక్ అయింది. సాంగ్స్ లీక్ అవ్వడం అనేది కొత్త విషయం ఏమీ కాదు. థమన్ మ్యూజిక్ డైరెక్షన్ చేసిన సర్కారు వారి పాట, గేమ్ చేంజర్ ఇప్పుడు గుంటూరు కారం కేవలం తమను చేస్తున్న సినిమాలకు మాత్రమే సాంగ్స్ లీక్ అయ్యాయి. దీన్ని బట్టి థమన్ ను కొంతమంది ట్రోల్ చేయటం మొదలుపెట్టారు.

Read More: Guntur Kaaram: మహేష్ ఫారిన్ ట్రిప్స్ పై ప్రొడ్యూసర్ కామెంట్స్..!

అయితే కొందరు మాత్రం ఫస్ట్ సాంగ్ ని కావాలనే లీక్ చేసి ఆ సాంగ్ కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ బట్టి ఒరిజినల్ సాంగ్ రిలీజ్ చేస్తారు. అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు గుంటూరు కారం నుంచి లీకైన ఈ సాంగ్ ను అనిరుధ్ పాడినట్టు తెలుస్తుంది. అయితే అనిరుద్ రీసెంట్ గా మ్యూజిక్ డైరెక్షన్ అందించిన లియో, జైలర్ సినిమాల ఆడియో ఎంత పెద్ద హిట్ అయిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులు కూడా అనిరుధ్ మ్యూజిక్ కి బ్రహ్మరథం పడతారు. ఇప్పుడు లీకైన ఈ సాంగ్ కొంతమందిని నిరాశపరచడంతో అనిరుధ్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
హీరో, విలన్ కలిసి కమెడియన్ ను చంపేసినట్లు అనవసరంగా అనిరుధ్ ను తగులుకున్నారు కొంతమంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు