Samantha News: తెలుగులో నెంబర్ వన్ హీరో ఎవరో చెప్పేసిన సామ్!

సమంత.. తెలుగు సినీ ప్రేక్షకులకి ఈ పేరుని ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఈమె ఒకరు. ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఎంతోమంది ప్రేక్షకులను మాయ చేసింది. ఇక అక్కినేని ఇంటి కోడలుగా వెళ్లిన ఈ ముద్దుగుమ్మ నాగచైతన్యతో కొన్నాళ్లపాటు కలిసివుండి.. ఆ తర్వాత ఏమైందో తెలియదుగానీ వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు.

Read More:Samantha Update: ఎట్టకేలకు మీడియా ముందుకు సమంత… వాటికి సమాధానం వచ్చేనా?

అప్పటినుండి వీరి గురించి ఏదో ఓ వార్త నిత్యం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇదిలాగుంటే తాజాగా సమంత చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అమెరికన్ సూపర్ హీరో సినిమా “ది మార్వెల్స్” కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రియలు ఎదురుచూస్తున్నారు. దీపావళి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సందర్భంగా మూవీ టీం అన్ని ప్రాంతాలలో ప్రమోషన్స్ జోరు పెంచింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో ఓ గ్రాండ్ ఈవెంట్ ని నిర్వహించింది.

- Advertisement -

Read More:Marvels: డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన హాలీవుడ్ బ్లాక్ బస్టర్..

ఇందులో సమంత పాల్గొని సందడి చేసింది. ఈ సందర్భంగా సమంత రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానాలు చెప్పింది. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్.. తెలుగులో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లాగా ఓ సూపర్ హీరో సిరీస్ తీస్తే మీరు సూపర్ హీరోలుగా ఎవరిని ఎంచుకుంటారు..? అని ప్రశ్నించారు. దీనికి సమంత సమాధానమిస్తూ.. ” ప్రస్తుతానికి నా దృష్టిలో అల్లు అర్జున్ నెంబర్ వన్ హీరో. అల్లు అర్జున్ అంటే నాకు పిచ్చి. అతనే నా సూపర్ హీరో. ఆయనతోపాటు విజయ్ దేవరకొండ కూడా” అంటూ సమాధానమిచ్చింది. దీంతో సమంత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు