Samantha Update: ఎట్టకేలకు మీడియా ముందుకు సమంత… వాటికి సమాధానం వచ్చేనా?

సినిమాలకు స్టార్ హీరోయిన్ సమంత దూరమై దాదాపు మూడు నెలలు గడుస్తుంది. మయోసైటిస్ కి చికిత్స కోసం అమెరికా వెళ్లిన సమంత… ఆరు నెలల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండబోతున్నట్టు ప్రకటించింది. సమంత మళ్లీ కనిపించాలంటే.. మరో మూడు నెలల కంటే ఎక్కువే టైం పడుతుంది. ఈ మధ్యలో ఖుషి ప్రమోషన్స్ కోసం ఓ సారి మీడియా ముందుకు వచ్చింది. ఖుషి రిలీజ్ అయిన తర్వాత అమెరికా వెళ్లిన సమంత… సోషల్ మీడియాలో మినహా ఎక్కడా కనిపించడం లేదు.

Read More: Samantha – Naga Chaitanya: సామ్ – చై ఇద్దరికీ ఒకే ప్రాబ్లమ్… అసలేమైంది?

అయితే తాజాగా వస్తున్న సమాచారం… సమంత అభిమానులకు ఒక రకంగా గుడ్ న్యూస్ చెప్పొచ్చు. త్వరలోనే సమంత మీడియా ముందుకు రాబోతుందని తెలుస్తుంది. నవంబర్ నెలలోనే ఈ మీడియా సమావేశం ఉంటుందని, ఈ సమావేశంలో సమంత పలు కీలక అంశాలను వెల్లడించే అవకాశాలు ఉన్నాయని ఓ వార్త వైరల్ అవుతుంది. సమంత, నాగ చైతన్య మళ్లీ కలవబోతున్నట్టు గత కొద్ది రోజుల నుంచి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. తన పెంపుడు కుక్క విషయం గురించి అయితే ఈ మధ్య కాలంలో జరిగిన రచ్చ అందరూ చూశారు.

- Advertisement -

Read More: Samantha Decision: అఖిల్ కోసం… అక్కినేని ఫ్యామిలీకి సమంత సవాల్?

అయితే వీటికి రాబోయే ప్రెస్ మీట్ లో సమంత సమాధానం ఇస్తుందని వార్తలు వస్తున్నాయి. అలాగే సమంత ప్రెస్ మీట్ పెట్టబోయేది తన పర్సనల్ విషయాల గురించి కాదని, తన క్లాత్ బ్రాండ్ సాకి కోసమని మరి కొంత మంది అంటున్నారు. కానీ, సామ్ ప్రెస్ మీట్ వెనక మరో కారణం ఉందట. అదేంటంటే… ది మార్వెల్స్ అనే ఇంగ్లీష్ సినిమా తెలుగులో విడుదల కాబోతుంది. ఈ సినిమా తెలుగు ప్రమోషన్స్ బాధ్యతలను సమంత తీసుకున్నదని సమాచారం. ఈ సినిమాను తెలుగులో ప్రమోషన్ చేయడానికి సమంత ప్రెస్ మీట్ పెట్టబోతుందని టాక్.

ఒక వేళ ఇదే నిజం అయితే, ఆ ప్రెస్ మీట్ లో సమంత పర్సనల్ విషయాలు గానీ, సాకి బ్రాండ్ గురించి గానీ సమంత ఎలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం ఉండదు.

For More Updates :

Grab Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు