Mega156: చిరు సరసన ఆ సీనియర్ హీరోయిన్

తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చాలామంది దర్శకులు తమ పేరుని నిలబెట్టుకుందామని వస్తుంటారు.  కానీ కొంతమంది మాత్రమే దర్శకులుగా ఇండస్ట్రీలో తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుని తమ మార్కుని క్రియేట్ చేస్తారు.  రీసెంట్ టైమ్స్ లో వచ్చిన సినిమాల్లో బింబిసారా” సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  కళ్యాణ్ రామ్ కి మార్కెట్ పడిపోయింది అనుకునే తరుణంలో బింబిసారా సినిమాతో బీభత్సమైన హిట్ ఇచ్చి దర్శకుడుగా తనకంటూ ఒక మార్కును క్రియేట్ చేసుకున్నాడు దర్శకుడు మల్లిడి వశిష్ట్.

మల్లెడి వశిష్ట్  చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో  నిలద్రొక్కుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు.  కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటుడుగా కూడా కనిపించాడు.  ఇంతకుముందు చాలామంది హీరోలతో ప్రాజెక్టులు ఓకే అనుకున్న తరుణంలో కూడా అవన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయి.  ఎట్టకేలకు “బింబిసారా” సినిమా చేసి, తన మొదటి సినిమాతోనే అందర్నీ ఆశ్చర్యపరిచాడు.   చాలామందికి దక్కని అదృష్టం ఇప్పుడు మల్లిడి వశిష్ట్ కి దక్కింది.  అది మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయటం.

ఎప్పటి నుంచో త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు మెగాస్టార్ తో సినిమా చేయాలని అనుకున్నారు. కానీ కుదరలేదు. మెగాస్టార్ తో సినిమా చేయడం ఒక కల. కానీ ఆ కల చాలా తక్కువ మందికి నెరవేరింది.  అది మల్లిడి వశిష్ట్  లాంటి దర్శకుడికి రెండువ సినిమాకే  చిరంజీవితో పని చేసే అవకాశం రావడం అనేది మామూలు విషయం కాదు.

- Advertisement -

ఈ సినిమాకి విశ్వంభర అనే టైటిల్ ను ఖరారు చేశారు.  ఈ సినిమాలో చిరు సరసన అనుష్క శెట్టి నటించనుంది.  ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ నవంబర్ 15 నుంచి రాజమండ్రి పరిషర  ప్రాంతాల్లో మొదలవ్వనున్నట్లు  సమాచారం వినిపిస్తుంది.  ఈ సినిమాకి చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మొదటి  సినిమాతో హిట్ అందుకున్న మల్లెడి వశిష్ట్  చిరంజీవితో సినిమా చేసి ఎంత పెద్ద హిట్ అందుకుంటాడో  అని చాలామంది వేచి చూస్తున్నారు.

ఇది కూడా  “బింబిసారా” లాంటి ఫాంటసీ జోనర్ లోనే ఉంటుందని కథనాలు వినిపిస్తున్నాయి.  కొంతమంది అయితే “జగదేకవీరుడు అతిలోకసుందరి” రేంజ్ లో ఈ సినిమా ఉండబోతుందని అన్నట్లు చెప్పుకొస్తున్నారు.  ఏదేమైనా రెండవ అవకాశాన్ని మెగాస్టార్ తో పొందుకొని సినిమా చేయటం అనేది మామూలు విషయం కాదు.  ఈ సినిమా హిట్ అయితే మల్లిడి వశిష్ట్  స్థాయి  పెరిగిపోయినట్లే.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.BinbisaraBimbisara

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు