Shruti Haasan Comments: పెళ్లి చేసుకోకపోవడం నేరమా..? శ్రుతి హాసన్ షాకింగ్ కామెంట్

లోక నాయకుడు కమల్ హసన్ కూతురు శ్రుతి హాసన్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమల్ కూతురిగా ఇండస్ట్రీకి వచ్చినా, కొద్ది రోజుల్లోనే తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కోలీవుడ్ నుంచి టాలీవుడ్ ఆ తర్వాత బాలీవుడ్ స్థాయికి ఎదిగింది. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ స్థాయిలో సినిమాలు చేసే హీరోయిన్ గా మారిపోయింది. అయితే శ్రుతి హాసన్ సినిమాలు ఎన్ని విజయం సాధించాయో.. అన్నే లవ్ ఎఫైర్లకు సంబంధించిన రూమర్స్ కూడా వచ్చాయి.

మొదట హీరో సిద్ధార్థ్‌తో అని, తర్వాత 3 సినిమా టైంలో ధనుష్ తో అని, ప్రేమమ్ మూవీ చేస్తున్నప్పుడు నాగ చైతన్యతో లవ్ ఎఫైర్ సాగించిందని వార్తలు వచ్చాయి. అలాగే ఓ ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన ప్రతి మ్యాచ్ కి వెళ్లడంతో అప్పటి చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ సురేష్ రైనాతో లవ్ ట్రాక్ నడిపింది అంటూ కూడా పుకార్లు వచ్చాయి. తర్వాత ఇవన్నీ రూమర్స్ గానే ఉన్నా… మైఖేల్ కోర్సలేతో డేటింగ్ లో ఉన్నట్టు శ్రుతి హాసనే స్వయంగా చెప్పింది. కానీ, అది పెళ్లి వరకు వెళ్లలేదు. ప్రస్తుతం శాంతాను హజారికాతో చట్టాపట్టాలేసుకుని శ్రుతి హాసన్ తిరుగుతుంది. ఇది పెళ్లి వరకు వెళ్తుందా అంటే ఇప్పుడే చెప్పలేం.

ఇది పెళ్లి ప్రశ్న శ్రుతి హాసన్‌కు గత కొన్ని రోజుల నుంచి ఎక్కువగా వినిపిస్తుంది. తాజాగా వీటిపై ఆమె స్పందించింది. ప్రస్తుతం తాను చాలా హాయిగా బతుకుతున్నానని చెప్పింది. ముప్పై ఏళ్లు దాటియి పెళ్లి ఎప్పుడు అంటూ కామెంట్స్ వస్తే మొదట్లో బాధపడినట్టు చెప్పుకొచ్చింది. కానీ, తాను పెళ్లి చేసుకోకపోవడం నేరమేమీ కాదు కదా… అది దేశ ఆర్దిక వ్యవస్థపై ప్రభావం ఏమీ చూపదు కదా అంటూ సమాధానం ఇస్తుంది. తన గురించి, తన పెళ్లి గురించి నెగిటివ్ గా మాట్లాడే వారిని తాను పట్టించుకోవడం మానేశానని చెప్పుకొచ్చింది.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు