Malavika Mohanan: సౌత్ ఇండస్ట్రీ హాట్ బ్యూటీ ఏంటి ఇలా మారిపోయింది?

బాలీవుడ్ హాట్ బ్యూటీ అంటే… దిశా పటనీ. అదే సౌత్ ఇండస్ట్రీలో దిశా పటనీని గుర్తు చేసే బ్యూటీ ఎవరు అంటే మాళవిక మోహనన్. సినిమాలు చేస్తున్నా, చేయకపోయినా తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ యూత్ ను తన వైపునకు తిప్పుకుంటుంది. ఈ మధ్య కాలంలో వైట్ శారీ కట్టుకుని రివర్ లో మతిపోయే ఫోజులు ఇస్తూ చేసిన హాట్ ఫోటో షూట్ ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నదిలో తేలియాడుతున్న హంస అంటూ నెటిజన్లు చేసిన కామెంట్స్ ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి.

అలాంటి హాట్ బ్యూటీ సినిమా అంటే ప్రేక్షకుల్లో మినిమం అంచనాలు ఉంటాయి. బోల్డ్ సీన్స్, అందాల ఆరబోతతో కుర్రకారుకు కావాల్సిన కంటెంట్ ఉండే పాత్ర ఉంటుందని అనుకుంటారు. కానీ, తాజాగా చియన్ విక్రమ్ నటించిన తంగలాన్ మూవీ టీజర్ రిలీజ్ అయింది. అందులో మెయిన్ లీడ్ గా మాళవిక మోహనన్ నటిస్తుంది. తంగలాన్ అనేది డిఫరెంట్ జానర్ మూవీ అయినా, మాళవిక మోహనన్ రోల్ పై ఇంట్రెస్ట్ అయితే ఉండేది. కానీ, ఇటీవల విడుదల టీజర్ లో మాళవిక మోహనన్ ను చూసి తన అభిమానులు అందరూ షాక్ అయ్యారు.

తంగలాన్ టీజర్ లో మాళవిక మోహనన్ కనిపించింది ఒకే ఒక్క షాట్ లో మాత్రమే. కానీ, ఆ పాత్ర గురించి అయితే ఫుల్ క్లారిటీ వచ్చింది. పూర్తి డీ గ్లామర్ గా కనిపిస్తున్న మాళవిక మోహనన్ ను చూసి తన అభిమానులు నిరాశ చెందుతున్నారు. అయితే, చాలా రోజులకు మాళవికకు మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్ర దొరికిందని కూడా అంటున్నారు.

- Advertisement -

ఈ పాత్రలో మాళవిక నిరూపించుకుంటే, స్టార్ హీరోయిన్ అయిపోయినట్టే అని అంటున్నారు. అయితే ఒక హీరోయిన్ కు మంచి పేరు రావాలంటే, గ్లామరస్ రోల్స్ కంటే, ఇలాంటి డీ గ్లామరస్ రోల్సే ఎక్కువ ఉపయోగపడుతాయి. ఇదే విషయాన్ని మాళవిక మోహనన్ గ్రహించిందని అందుకే తంగలాన్ మూవీ చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు