Samantha Decision: అఖిల్ కోసం… అక్కినేని ఫ్యామిలీకి సమంత సవాల్?

అక్కినేని సమంత… నాగ చైతన్యతో డైవర్స్ తర్వాత మళ్లీ సమంత రూత్ ప్రభు అయిపోయింది. విడాకుల తర్వాత కొన్ని రోజుల పాటు డిప్రెషన్ లో ఉన్న సామ్… దాని నుంచి తెరుకుని వరుసగా సినిమాలు చేసింది. అయితే ఇప్పుడు సామ్ మయోసైటీస్ కు చికిత్స తీసుకోవడానికి ఆరు నెలల పాటు కెమెరాకు దూరంగా ఉంటుంది. అయితే సమంతకు మయోసైటిస్ వచ్చిన తర్వాత చాలా మంది సెలబ్రెటీలు స్పందించారు. కానీ, అక్కినేని ఫ్యామిలీలో నుంచి మాజీ భర్త కానీ, మాజీ అత్త కానీ, మాజీ మామ కానీ, స్పందిచంలేదు. కానీ, సామ్ మరిది అఖిల్ మాత్రం సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. త్వరగా కోలుకోవాలని ఓ పోస్ట్ పెట్టాడు. దానికి సామ్ కూడా రిప్లే ఇచ్చింది.

ఈ పోస్ట్ తో సమంత, అఖిల్ మధ్య ఎలాంటి సాన్నిహిత్యం ఉందో చాలా మందికి తెలిసింది. కుటుంబం నుంచి వెళ్లిపోయినా, ఒకరిపై ఒకరికి గౌరవం ఉందని అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. అయితే ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ వరుసగా ఫ్లాప్స్ ను ఎదుర్కొంటుంది. అఖిల్ ఎంతో కష్టపడి, ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఏజెంట్ చిత్రం దారుణంగా విఫలమైంది. ఇప్పుడు తర్వాత సినిమా చేయడానికి కూడా ఆలోచిస్తున్నాడు. మళ్లీ సినిమా ఫెయిల్ అయితే, ఇక కెరీర్ కి పులిస్టాప్ పెట్టాల్సిందే.

అందుకే అఖిల్ తన తర్వాత సినిమా గురించి ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అఖిల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడట. తన తర్వాత సినిమాలో గెస్ట్ పాత్రను సామ్ తో చేయించాలని అనుకుంటున్నాడట. దీనికి సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మరిది కెరీర్ కోసం గెస్ట్ పాత్ర చేయడానికి రెడీ అయిపోయిందట. అయితే అఖిల్ సినిమాలో సామ్ నటించడం అక్కినేని ఫ్యామిలీలో ఎవరికీ ఇష్టం లేదట.

- Advertisement -

కానీ, సామ్ మాత్రం అసలు వెనక్కితగ్గకుండా, అఖిల్ సినిమాలో క్యామియో రోల్ చేసి తీరుతానని తెగేసి చెప్పిందట. ఇప్పుడు అఖిల్ చెప్పినా వినడం లేదని తెలుస్తోంది. సామ్ ఇండస్ట్రీకి తిరిగి వచ్చిన తర్వాత అఖిల్ తర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని, అప్పుడు సామ్ పైన షూటింగ్ ఉంటుందని తెలుస్తుంది. అయితే దీనిలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. కానీ, ఇటీవల సమంత తనపై ఉన్న నాగ చైతన్య టాటూను తొలగించిన నాటి నుంచి సామ్ – నాగ చైతన్య వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. ఒక వేళ ఇప్పుడు అఖిల్ సినిమాలో సమంత నిజంగానే గెస్ట్ రోల్ చేస్తే… పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు