Taapsee Comments: తాప్సీ చుట్టూ మరో వివాదం… టాలీవుడ్ నుంచి బహిష్కరణ?

దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఝుమ్మందినాదం అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన తాప్సీ పన్ను గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాలలో నటించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించింది. అయితే కొంతకాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస చిత్రాలతో బిజీ అయ్యింది తాప్సి.

ఇటు తెలుగు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. తెలుగులో సినిమాలు చేయకపోవడంపై తాప్సి స్పందిస్తూ.. “కమర్షియల్ హీరోల సరసన నటించాలనే ఆశ నాకు కూడా ఉంది. ఆ ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోను. కానీ నాకు ఇప్పటివరకు అలాంటి అవకాశం రాలేదు. నా వరకు చిన్న సినిమాలలో నటించడమే ఆత్మ సంతృప్తిగా అనిపిస్తూ ఉంటుంది.”

“పరిమితంగా పారితోషికం ఇచ్చినా అలాంటి సినిమాలలో నటించడం వల్ల ఆత్మ సంతృప్తి లభిస్తుంది. తెలుగు చిత్రాల్లో నటించక పోవడానికి కారణం సరైన కథలు రావడం లేదు. ఒకవేళ వచ్చినా అవి నచ్చడం లేదు. సరైన కథలు రాకపోవడం వల్లే నేను తెలుగులో నటించలేకపోతున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

- Advertisement -

దీంతో కమర్షియల్ హీరోల సరసన అంటే రవితేజ, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సరసన నటించావు కదా..? వాళ్లు కమర్షియల్ హీరోలు కాదా..? ఇలాంటి కామెంట్స్ చేయడం తప్పు అంటూ నెటిజెన్లు మండిపడుతున్నారు. తెలుగు హీరోలను తక్కువ చేసి మాట్లాడిన తాప్సిని టాలీవుడ్ నుంచి బహిష్కరించాలని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు