Mysskin: సేతుపతికి ఏమైంది? గుర్తుపట్టలేనంత మారిపోయాడు..

కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి, ఇప్పుడు స్టార్ హీరోగా సినిమాలు చేస్తూ, లెజెండరీ ఆక్టర్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ మక్కల్ సెల్వన్ గా తన నటనా ప్రతిభను చూపిస్తున్నాడు. ఇక రీసెంట్ గా జవాన్ లో విలన్ గా నటించి మెప్పించిన విజయ్ సేతుపతి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించలేదు.

కానీ సడన్ గా ఈరోజు విజయ్ సేతుపతి ఒక సినిమా సెట్స్ లో దర్శనమిచ్చాడు. అయితే సెట్స్ సభ్యులతో ఉన్న విజయ్ సేతుపతి ని చాలా సేపు గుర్తించలేదు. సెట్స్ లో తాను చేస్తున్న సినిమా గెటప్ లో ఉన్న ఆ స్టిల్ సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అయిపోతుంది. ఆ గెటప్ లో విజయ్ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. పొడవు ముక్కుతో పెన్సిల్ మీసంతో చాలా 60స్ కాలానికి చెందిన మనిషిగా ఉన్నాడు. ఆ లుక్ చూసి ఫ్యాన్స్ ఎందుకు ఇలా అయ్యాడని, ఏదయినా జబ్బా అంటూ, కంగారు పడుతూ ఆరా తీస్తున్నారు.

నిజానికి విజయ్ సేతుపతికి ఏమి కాలేదు. అది తాను చేస్తున్న కొత్త సినిమాలో లుక్. తమిళ్ డైరెక్టర్ మిస్కిన్ తీస్తున్న కొత్త సినిమాలో ఆ లుక్ లో విజయ్ సేతుపతి కనిపిస్తున్నాడు. అయితే ఇలాంటి వేషాలు మక్కల్ సెల్వన్ కి కొత్త కాదు. ఇంతకు ముందు సీతాకత్తి, విక్రమ్, ఉప్పెన లాంటి సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించాడు. అందుకే మక్కల్ సెల్వన్ కి అన్ని చోట్ల ఫాలోయింగ్ ఉంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు