Vijay Sethupathi: RC16లో మక్కల్ సెల్వన్! ఇంతకీ రోల్ ఏంటి?

Vijay Sethupathi:

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో ఓ సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ సినిమా సెప్టెంబర్ లో ఓపెనింగ్ జరుపుకుని, జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని టాక్. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ. ఆర్ రెహ్మాన్ ఫిక్స్ అయ్యాడని టాక్ నడుస్తుంది. అయితే ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ కూడా నటిస్తున్నాడని లేటెస్ట్ గా సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది.

ఆ స్టార్ మరెవరో కాదు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. ఆల్రెడీ బుచ్చిబాబు తీసిన ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటించాడన్న సంగతి తెలిసిందే. ఉప్పెన లో విజయ్ సేతుపతి యాక్టింగ్ సినిమాని మరో ఎత్తుకి తీసుకెళ్లిందని చెప్పొచ్చు. అందుకే బుచ్చిబాబే రామ్ చరణ్ కి విజయ్ సేతుపతి ని సజెస్ట్ చేసాడని సమాచారం. ఆల్రెడీ సైరా నుండి రామ్ చరణ్ విజయ్ సేతుపతి చాలా క్లోజ్ అని తెలిసిందే. అందుకే వెంటనే చరణ్ కూడా ఓకే చెప్పాడని టాక్.

అయితే RC16లో విజయ్ సేతుపతి చేసేది విలన్ రోలా? లేక ఇంపార్టెంట్ పాత్రా? అనేది తెలీదు. అయితే సేతుపతి ఏ పాత్ర చేసినా అందులో అతను ఒదిగిపోతాడని తెలిసిందే. పైగా విజయ్ సేతుపతి నటించిన మాస్టర్, విక్రమ్ లాంటి సినిమాలు హిట్ అవడానికి విజయ్ పాత్ర కూడా ఒక కారణం. అందుకే RC16లో విజయ్ సేతుపతి నటిస్తే సినిమాకి ప్లస్ అవుతుందని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు.

- Advertisement -

అయితే ఈ విషయంపై మేకర్స్ సరైన క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇక RC16లో రామ్ చరణ్ సరసన శ్రీ లీల లేదా, మృణాల్ ఠాకూర్ నటించే అవకాశం ఉంది. అయితే రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ షూట్ ఫినిష్ అయ్యాకే, ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని సమాచారం.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు