RC16: మొన్న శ్రీ లీల.. ఇప్పుడు మరో భామ?

RC16:

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా రానుందన్న విషయం తెలిసిందే. గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ ఫినిష్ అయిన తర్వాతే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. రామ్ చరణ్ 16వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ లో ఓపెనింగ్ జరుపుకోనున్న ఈ సినిమా జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడని టాక్ నడుస్తుంది.

ఇక సినిమాలో నటీనటుల విషయంలో ఇంకా సెలెక్షన్స్ వర్క్ జరుగుతూనే ఉంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఇంకా ఎవరు ఫైనలైజ్ కాలేదని చిత్ర యూనిట్ నుండి సమాచారం వచ్చింది. అయితే మొన్నటి వరకు శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చాయి. తాజాగా RC16లో మరి భామ నటిస్తుందని న్యూస్ వైరల్ అవుతుంది. ఆ భామ మరెవరో కాదు, సీతగా తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన మృణాల్ ఠాకూర్.

అవును..RC16లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుందని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుండి అఫిషియల్ గా కన్ఫర్మేషన్ రాలేదు. అయితే నెటిజన్ల అభిప్రాయం ప్రకారం మృణాల్ ఠాకూర్, శ్రీ లీల ఇద్దరూ ఈ సినిమాలో నటిస్తారని, ఒకరి పాత్ర ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఉంటుందని అంటున్నారు. ఈ వార్తల్లో ఏది నిజమో తెలీదు గాని, మృణాల్ ఠాకూర్ కి ఛాన్స్ రావడం నిజమే అయితే తెలుగులో తన కెరీర్ టాప్ గేర్ లో వెళ్లడం ఖాయం.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు