Boxoffice: జైలర్ లెక్క 500కోట్లు.. రజిని స్టామినాకి నిదర్శనం!

jailer Box office Collections:

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ ఆగష్టు 10న రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత రజినీకాంత్ జైలర్ తో మళ్ళీ బాక్స్ ఆఫీస్ రికార్డుల వేట మొదలెట్టాడు. ఇక ఈ సినిమాతో రజినీకాంత్ రోబో తర్వాతమళ్ళీ ఇండస్ట్రీ తన రేంజ్ లో ఇండస్ట్రీ హిట్ కొట్టాడని చెప్పొచ్చు. మొదటి రోజు నుండే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ మార్జిన్ తో రికార్డు ఓపెనింగ్స్ తెచ్చుకోగా, రోజుకో రికార్డు సెట్ చేస్తూ బాక్స్ ఆఫీస్ లెక్కలన్నీ సరి చేసాడు రజినీకాంత్.

ఇక కేవలం అయిదు రోజుల్లోనే జైలర్ బ్రేక్ ఈవెన్ అయిపోగా ఇప్పటి వరకు దాదాపు 100కోట్ల లాభాన్ని ఆర్జించింది జైలర్. ఇక తాజాగా జైలర్ మరో రేర్ రికార్డుని సాధించింది. నిన్న ఆదివారం అడ్వాంటేజ్ తో రెచ్చిపోయిన జైలర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల మార్క్ ని దాటేసింది. 11 రోజుల్లోనే జైలర్ 502 కోట్ల గ్రాస్ రాబట్టగా, 246కోట్ల షేర్ ని సాధించింది. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ మమ్ముట్టి, అలాగే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ప్రత్యేక అతిథి పాత్రల్లో నటించారు. వీళ్ళ గెస్ట్ అప్పీరెన్స్ ఈ సినిమాకి ఇంత భారీ వసూళ్లు రావడానికి చాలా హెల్ప్ అయిందని చెప్పొచ్చు.

ఎందుకంటే కర్ణాటక, కేరళలో కలిపి జైలర్ కి 110కోట్లకి పైగా కలెక్షన్లు వచ్చాయి. ఇక జైలర్ లో తెలుగు స్టార్ నటులు లేకపోయినా, సునీల్, నాగబాబు, తమన్నా, రమ్యకృష్ణ లాంటి నటులు ఉండడం వల్ల డబ్బింగ్ సినిమా అన్న ఫీల్ పెద్దగా రాలేదు. ఇక జైలర్ సినిమా ఓవరాల్ కలెక్షన్లు ఎండ్ అయ్యే సరికి 600కోట్లని క్రాస్ చేయొచ్చు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు