GandeevaDhari Arjuna: ఈ వారం 4 సినిమాలు.. కానీ ఆడియన్స్ చూపు దానిపైనే?

GandeevaDhari arjuna

టాలీవుడ్ లో జైలర్ తరువాత గత వారం రెండు సినిమాలు రిలీజ్ కాగా ఆ రెండు కూడా ప్రేక్షకులని మెప్పించలేకపోయాయి. అందుకే రెండో వారం కూడా జైలర్ హవానే సాగింది. ఇక ఈ వారం మాత్రం తెలుగులో నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి. అయితే అందులో రెండు డబ్బింగ్ సినిమాలు ఉండగా, మరో రెండు స్ట్రెయిట్ సినిమాలు కావడం విశేషం. అయితే ఈ నాలుగు సినిమాలు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో రిలీజ్ అవుతుండగా, ఈ నాలుగింటిలో మాత్రం ప్రేక్షకుల దృష్టి ఎక్కువగా ఒక్క సినిమాపై ఉంది.

ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాల్లో ఆడియన్స్ లో ఎక్కువ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న చిత్రం “గాండీవధారి అర్జున”. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాని ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమా ఆగష్టు11 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. ఇక ఇప్పటికే హైదరాబాద్ వంటి మహానగరాల్లో బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి.

ఇక గాండీవ దారుడిని ఢీ కొట్టడానికి కార్తికేయ బెదురులంక(2012) తో వస్తున్నాడు. కాన్సెప్ట్ రొటీన్ గానే ఉన్నా, ట్రైలర్ బాగుండి ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు ఉన్నాయి. కామెడీ సినిమాలు కోరుకునే ప్రేక్షకులని ఈ సినిమా మెప్పించే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు తెలుగు సినిమాలకి పోటీగా, మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ అఫ్ కొత్త రిలీజ్ అవుతుంది.

- Advertisement -

దుల్కర్ సల్మాన్ ఒక రౌడీగా నటించిన ఈ సినిమా తెలుగు సినిమాల కంటే ఒక రోజు ముందుగా ఆగష్టు 24న రిలీజ్ అవుతుంది. ట్రైలర్ తో బాగా ఆకట్టుకున్న ఈ సినిమాపై కూడా ఆడియన్స్ లో ఎన్నో అంచనాలున్నాయి. ఇక వీటితో పాటు కన్నడ లో సూపర్ హిట్ అయిన బాయ్స్ హాస్టల్ కూడా ఈ వారం రిలీజ్ అవుతుంది. ఈ సినిమా గురించి ఎక్కువ మంది ఆడియన్స్ కి తెలియకపోయినా ట్రైలర్ బాగుండడంతో ఆడియన్స్ ని మెప్పించే అవకాశం ఉంది. పైగా ఈ మధ్య కన్నడ నుండి వస్తున్న సినిమాలు బాగా ఆకట్టుకుంటున్నాయి. మరి రిలీజ్ అవుతున్న ఈ నాలుగు సినిమాల్లో ఏ సినిమా ఆకట్టుకుంటుందో చూడాలి.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు