Mega 157: మెగా స్టార్- వసిష్ఠ మూవీ సాలిడ్ అప్డేట్

Mega 157

మెగా స్టార్ చిరంజీవి మొత్తానికి రీమేక్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి, స్ట్రయిట్ సినిమాలపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా భోళా శంకర్ ఇచ్చిన షాక్ కు ఢీలా పడిపోయిన మెగా ఫ్యాన్స్ లో తిరిగి మళ్ళీ జోష్ నింపడానికి మెగా స్టార్ చిరంజీవి రెడీ అయ్యాడు.

ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి, బింబిసార ఫేం డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కున్న ఈ సినిమా నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. బింబిసార సినిమా తరహాలోనే ఈ సినిమా కూడా సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఉండబోతుందని సమాచారం అందుతోంది. మెగా స్టార్ చిరంజీవి గతంలో నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుందని కూడా టాక్ వినిపిస్తోంది. ఇక సినిమాకు సంబంధించి కాసెప్ట్ పోస్టర్ ను రేపు మెగా స్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేయబోతున్నట్టు టాక్. ఇన్సైడ్ సమాచారం ప్రకారం ఈ కాన్సెప్ట్ పోస్టర్ కు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. మెగా స్టార్ వాయిస్ ఓవర్ తో ఈ కాసెప్ట్ పోస్టర్ ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది.

అయితే నిజానికి భోళా శంకర్ సినిమా తరువాత మెగా స్టార్ చిరంజీవి సుష్మిత కొణిదెల సొంత ప్రొడక్షన్స్ లో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మలయాళం రీమేక్ అయిన బ్రో డాడీ సినిమా చేయాల్సి ఉండింది. కాకపోతే భోళా శంకర్ సినిమాకు భారీగా నెగిటివిటి రావడంతో బ్రో డాడీ రీమేక్ ను ప్రస్తుతం చిరంజీవి పక్కన పెట్టినట్టు సమాచారం. దాంతో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ప్రస్తుతం ఒరిజినల్ స్టోరీని ప్రిపేర్ చేసే పనిలో పడ్డాడు. మొత్తానికి భోళా శంకర్ సినిమా చిరంజీవిలో భారీ మార్పునే తెచ్చినట్టుంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు