Aishwarya dhanush divorce: ఆ ఇంటి కారణంగానే ధనుష్ – ఐశ్వర్య విడాకులు తీసుకున్నారా..?

Aishwarya dhanush divorce

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ – ఐశ్వర్య రెండు సంవత్సరాల క్రితం విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వీరి విడాకుల ప్రకటన అభిమానులను ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. సుమారు 18 ఏళ్లపాటు కలిసి ఉన్న ధనుష్ – ఐశ్వర్య దంపతులు ఈ నిర్ణయం తీసుకోవడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అయితే వారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది బహిరంగంగా వారిద్దరిలో ఎవరు తెలుపలేదు. ఓ ప్రముఖ హీరోయిన్ వల్లే ధనుష్ – ఐశ్వర్య విడిపోయారని అప్పట్లో ప్రచారం జరిగినా ఆ ప్రచారంలో నిజం లేదని తెలుస్తోంది.

అయితే వీరిద్దరూ ఎందుకు విడాకులు తీసుకున్నారు..? అనే క్లారిటీ లేకపోవడంతో రకరకాల రూమర్స్ పుట్టుకొచ్చాయి. వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి కారణం ఇదేనంటూ ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్ లో మరో వార్త వైరల్ గా మారింది. అదేంటంటే చెన్నైలోని పోయెస్ గార్డెన్స్ లో ధనుష్ ఓ ఇంటిని నిర్మించారు. 2021లో ఈ ఇంటి కోసం ధనుష్ ఏకంగా 150 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం గమనార్హం. అయితే ధనుష్ ఆ ఇంటిని నిర్మించడం రజినీకాంత్ కి ఇష్టం లేదట.

ధనుష్ ఎంచుకున్న స్థలం సరైనది కాదని.. ఆ స్థలంలో ఇంటిని నిర్మిస్తే వాస్తు సంబంధిత సమస్యలు వస్తాయని ముందే ధనుష్ ని హెచ్చరించారట రజనీకాంత్. ధనుష్ మాత్రం అవేవీ లెక్కచేయకుండా రజిని ఇంటికి అతి సమీపంలోనే పెద్ద ఇల్లు నిర్మించారు. కానీ ధనుష్ ఆ ఇంటిని ప్రారంభించిన కొద్ది నెలల్లోనే ఐశ్వర్యతో గొడవలు ప్రారంభమయ్యాయి. మా నాన్న కంటే రీచ్ గా ఇల్లు ఎందుకు కడుతున్నావని ధనుష్ నీ ప్రశ్నించిందట ఐశ్వర్య. దీంతో ఆ గొడవ అంతకంతకు పెద్దదైందని సమాచారం. ఈ కారణంగానే వీరు విడాకులు తీసుకున్నారని ఇప్పుడు ఓ వార్త కోలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది.

- Advertisement -

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు