Jailer: విక్రమ్ ని వారంలో దాటేసిన జైలర్.. అయినా?

Jailer Breaks Vikram:

కోలీవుడ్ లో సినిమాలు మళ్ళీ ఊపందుకుంటున్నాయి. గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాల ప్రభావంతో ఇతర ఇండస్ట్రీ వాళ్ళు తమిళ్ మూవీస్ చూడడం తక్కువైంది. అయితే లాస్ట్ ఇయర్ నుండి వరుస బెట్టి తమిళ సినిమాలు మంచి కలెక్షన్లు రాబట్టడమే గాకుండా, కంటెంట్ పరంగా కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. గత ఏడాది విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టగా, తమిళనాడులో లో ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఇదిలా ఉండగా రజినీకాంత్ జైలర్ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి భారీ కలెక్షన్లు సాధిస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా కి కలెక్షన్లు బాగానే వస్తున్నా, కంటెంట్ పరంగా విక్రమ్ రేంజ్ మూవీ కాదనేది వాస్తవం. అయితే కలెక్షన్ల పరంగా మాత్రం విక్రమ్ సాధించిన ఓవరాల్ కలెక్షన్లను జైలర్ వారం రోజుల్లో బ్రేక్ చేయడం విశేషం.

విక్రమ్ సినిమా 417కోట్ల గ్రాస్ వసూలు చేయగా, జైలర్ సినిమా వారం రోజుల్లో 425కోట్లు రాబట్టి దాన్ని బ్రేక్ చేసేసింది. అయితే అది అన్ని వెర్షన్లు కలిపి కావడం వల్ల జైలర్ ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ అవుతుంది గాని, తమిళ్ లో ఇండస్ట్రీ హిట్ కాదు అంటున్నారు కమల్ ఫ్యాన్స్. ఎందుకంటే విక్రమ్ తమిళనాడు రాష్ట్రంలో 187కోట్లు రాబట్టగా, జైలర్ ఇప్పటివరకు 123కోట్లే రాబట్టింది.

- Advertisement -

అందువల్ల తమిళనాడులో జైలర్ ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది. జైలర్ కి బయటి దేశాల్లో ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. అయితే జైలర్ ఇంకా లాంగ్ రన్ లో ఆడుతుంది, కాబట్టి విక్రమ్ ని బ్రేక్ చేసే అవకాశం లేకపోలేదు. మరి చూడాలి జైలర్ ఓవరాల్ కలెక్షన్లు ఎలా ఉంటాయో!

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు