Bimbisara : ఎట్టకేలకు రాబోతున్నాడు

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన చిత్రం “బింబిసార”. ఆగస్టు 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అతిపెద్ద విజయాన్ని సాధించిన చిత్రంగా ” బింబిసార నిలిచింది. సినీ సెలబ్రిటీలూ, క్రిటిక్స్ కూడా ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. 

ఇక ఈ సినిమాలో కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. పిరియాడిక్ సైన్స్ ఫిక్షన్ జానెర్ లో తెరకెక్కిన ఈ సినిమాకు కీరవాణి తో పాటు చిరంతన్ బట్ తమ సంగీతాన్ని అందించారు. ముఖ్యంగా వశిష్ట ఈ సినిమాకి దర్శకత్వం వహించగా ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ హీరోగా, నిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కించారు. థియేటర్లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాా ఎప్పుడెప్పుడు ఓటీటి లోకి వస్తుందా అని సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ ఫాంటసీ యాక్షన్ చిత్రం ఓటిటి “జీ5” లో దసరా కానుకగా ఈ నెల 7 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి. కానీ బింబిసారా స్ట్రీమింగ్ కాలేదు. ఆ తరువాత దీపావళికి కచ్చితంగా వస్తుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. తాజాగా ఈ వార్తలకు పులిస్టాప్ పెడుతూ.. బింబిసారా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ని అధికారికంగా ప్రకటించింది జీ5. ప్రేక్షకులు తమ చిత్రం కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలియజేసే వీడియోను షేర్ చేస్తూ బిబిసారుడిని ఈ నెల 21న కలవండి అని పేర్కొంది. దీపావళి కానుకగా ఈ మూవీ అక్టోబర్ 21న స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది “జీ5”.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు