Varun Tej: ప్రీ టీజర్ తోనే హైప్ పది రెట్లు పెంచేసిన మెగా హీరో

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో “గాండీవధారి అర్జున” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం పై భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తుండగా, మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది.

తాజాగా గాండీవధారి అర్జున చిత్రానికి సంబంధించి ప్రీ టీజర్ విడుదలయింది. ముందుగా అనుకున్నట్టుగానే ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఒక గూఢచారిగా కనిపిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఒక సీక్రెట్ రా ఏజెంట్ గా అర్జున్ వర్మ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రీ టీజర్ లో వరుణ్ తేజ్ కి ఎక్కడా ముందు నుండి కనిపించకుండా సస్పెన్స్ లో ఉంచారు. వరుణ్ తేజ్ ఫైట్స్ చేస్తూ ప్రత్యర్థుల్ని ఎదుర్కొంటున్న సీన్స్ ని ఎంతో అద్భుతంగా టీజర్ కట్ లో చూపించాడు డైరెక్టర్. ఇక దానికి తగ్గట్టు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. అంతే కాకుండా ప్రీ టీజర్ ని గమనిస్తే మూవీ కోసం భారీగా ఖర్చుపెట్టినట్టు అనిపిస్తుంది. టీజర్ లో మిగతా నటీనటులను కూడా ఎక్కడా రివీల్ చేయకుండా, ఛేజింగ్, ఫైట్స్ నే చూపించాడు.

- Advertisement -

ఇక “గాండీవధారి అర్జున” సినిమాని ఆగష్టు 25న విడుదలకు సిద్ధం చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వచ్చిన ప్రీ టీజర్ లో చివరన ప్రీ టీజర్ కమింగ్ సూన్ అని వేశారు. కానీ రిలీజ్ డేట్ ని మెన్షన్ చేయలేదు. అంటే ఈ సినిమాను పోస్టుపోన్డ్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందా అనే డౌట్ వస్తుంది. మరి దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తే మంచిదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు