Nani: దసరా కాంబినేషన్ రిపీట్ – క్లిక్ చేస్తే పూర్తి డిటేల్స్

ఈ ఏడాది వచ్చిన మోస్ట్ ప్రాఫిటబుల్ సినిమాలలో నాని హీరోగా నటించిన దసరా సినిమా ఒకటి. శ్రీకాంత్ ఓదెల అనే డెబ్యూ డైరెక్టర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత మార్చి 30న రిలీజై, బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా దీక్షిత్ శెట్టి, షైన్ టామ్, సముద్రఖని ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా నాని కెరీర్ లోనే 100 కోట్ల కలెక్షన్ సాధించిన మొదటి సినిమాగా నిలిచింది.

ఎస్ఎల్విసి బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా నాని కెరీర్ లోనే మొదటి పాన్ ఇండియాగా తెరకెక్కింది. దాదాపు 65 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించబడిన ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. దసరా సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి పోస్టర్స్ ద్వారా, పాటల ద్వారా ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించింది. దాంతో సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. ప్రేక్షకుల అంచనాలన్నీ నిజం చేసేల సినిమా రిలీజై మంచి విజయాన్ని సాధించటంతో పాటు రాజమౌళి వంటి దర్శకుల నుండి ప్రశంశలు కూడా అందుకుంది.

అయితే దసరా సినిమా తరువాత నాని ఫాదర్ సెంటిమెంట్ తో శౌర్యవ్ అనే డెబ్యూ డైరెక్టర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకోగా, వచ్చే డిసెంబర్ లో రిలీజ్ కు రెడీ అవుతుంది. అయితే ఈ సినిమా అనంతరం ఒక కోలీవుడ్ దర్శకుడితో నాని సినిమా చేయబోతున్నాడని వార్తలు రాగా వాటిని కొట్టిపారేస్తూ మరో రూమర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇటీవలనే దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నానిని కలిసి కథ వినిపించినట్టు టాక్ వస్తుండగా. నానికి కూడా శ్రీకాంత్ చెప్పిన స్టోరీ నచ్చి, వెంటనే ప్రి ప్రొడక్షన్ స్టార్ట్ చేయమని చెప్పడంతో శ్రీకాంత్ ఆ పనుల్లో ఉన్నాడని తెలిసింది. తొందర్లోనే మొదలవనున్న ఈ ప్రాజెక్ట్ పై ఈ నెలలో అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని టాక్.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు