Rangabali: నాగ శౌర్య ఓవర్ కాన్ఫిడెన్సే కొంప ముంచిందా?

కట్ అవుట్ ఎంత బాగున్నా కంటెంట్ లేని సినిమాలు ఎంచుకోక పోతే ఎవరి కెరీర్ ఆయిన అగమ్యగోచరమే అని ఈ మధ్య చాలా మంది యంగ్ హీరోలు ప్రూవ్ చేస్తున్నారు. స్టేజ్ మీద మా సినిమా తోప్ దమ్ముంటే ఆపు అని ప్రగల్బాలు పలికే ముందే ఒకటి రెండు సార్లు ఆలోచించాలి. సినిమా బాగుంటే హీరో కాన్ఫిడెన్స్ సినిమాకు ఖచ్చితంగా ప్లస్ అవుతుంది అందులో డౌట్ ఏ లేదు . కానీ పొరపాటున సినిమా గనక బాగా లేకపోతే ఆ ఆపు – తోపు డైలాగ్ లనే కామన్ గా పెట్టుకొని సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురి కావాల్సి వస్తుంది.

ఇక అసలు విషయానికొస్తే యంగ్ హీరో నాగ శౌర్య ఎంత కాదనుకున్న ఇండస్ట్రీలో గుడ్ లూకింగ్ ఉన్న హీరోల్లో ఒకడు. ఊహలు గుస గుస లాడే సినిమాతో యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో ఇండస్ట్రీలో మరో న్యాచురల్ స్టార్ నాని అవుతాడనుకుంటే కేవలం నాగ శౌర్య గానే మిగిలిపోయాడు.

దీనికి కారణం మొహమాటానికి పోయి, చేతికందొచ్చిన సినిమాలన్నీ చేయటమే అని ఆయన ఫిల్మ్గ్రఫీ చూస్తే తెలుస్తుంది. గత కొద్దీ కాలంగా ఫ్లాప్ సినిమాలతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తున్న నాగ శౌర్య ఇటీవలనే రంగబలి అనే సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు.

- Advertisement -

అయితే సినిమా రిలీజ్ కు ముందు ప్రి రిలీజ్ ఈవెంట్ లో తాను ఈ సినిమా పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్ననని చెప్పి స్పీచ్ అదరకొట్టేసాడు. సరే అని ఆయన మాట నమ్మి థియేటర్స్ కు వెళ్లారు జనాలు. తీరా చూస్తే మళ్ళి అదే సీన్ రిపీట్ అయింది. మొదటి రోజు కాస్త పరవాలేదనిపించిన కలెక్షన్స్ ఇప్పుడు మరీ దారుణంగా పడిపోయాయి.

ఆయన స్పీచ్ లో ప్రొడ్యూసర్ కు అధిక లాభాలు తెచ్చే చిత్రమవ్వాలని ఆయన జ్యోసించగా ఇప్పుడుఆ స్టేట్మెంట్ కాస్త మారి అధిక నష్టాన్ని తెచ్చిన సినిమాగా ఎండ్ అయింది. గతంలో కూడా ఈయన అశ్వత్థామ సినిమా విషయంలో ఇలాగే మాట్లాడి ఫ్లాప్ ను మూటగట్టుకోగా రంగబలి సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. ఇక నైన ఈ యంగ్ హీరో స్పీచ్ మీద కాకుండా స్క్రిప్ట్ మీద దృష్టి పెడితే బాగుంటుందని ఆడియెన్స్ టాక్.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు