Jailer: జస్ట్ 3డేస్.. టార్గెట్ అవుట్.. రజిని మేనియా..

Jailer 3Days Collections

టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ కూడా ఒకటి. ఈ సినిమాలో ఆయన ఒక రిటైర్డ్ జైలర్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 10న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్సడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే జైలర్ ఓపెనింగ్స్ మాత్రం ఓ రేంజ్ లో కుమ్మాయి. ఫస్ట్ డే నే 90 కోట్లతో విధ్వంసం సృష్టించిన ఈ సినిమా రెండో రోజు కూడా 55 కోట్లకి పైగా కొల్లగొట్టింది. తాజాగా జైలర్ మూడు రోజుల కలెక్షన్స్ వివరాలు బయటికి వచ్చాయి.

మూడో రోజు జైలర్ అన్ని అంచనాలను మించిపోయి ఏకంగా 70 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించింది. ఇక జైలర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మూడవ రోజు నాలుగు కోట్లకి పైగా అందుకుంది. ఈ మూడు రోజుల వసూళ్లతో జైలర్ తెలుగులో బ్రేక్ ఈవెన్ కూడా అయిపొయింది. జైలర్ సినిమా తెలుగు వెర్షన్ కి కేవలం 12కోట్ల బిజినెస్ జరగగా, మూడో రోజు వచ్చిన వసూళ్లతో కలిపి జైలర్ తెలుగు స్టేట్స్ లో 13.81కోట్ల షేర్ సాధించింది. అంటే జైలర్ సినిమా తెలుగు లో బ్రేక్ ఈవెన్ అవడమే కాకుండా అదనంగా 80లక్షలు ప్రాఫిట్ కూడా అందుకుంది.

ఇక జైలర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో 105 కోట్ల షేర్ 214కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ సినిమాని 124కోట్ల బిజినెస్ జరగగా మరో 20కోట్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ పూర్తయి లాభాల్లోకి వెళ్తుంది. నాలుగో రోజుతో ఈ టార్గెట్ ని ఈజీ గా అందుకునే అవకాశం ఉంది. ఇక జైలర్ భారీ లాభాలు అందుకునే అవకాశం ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు