Shankar Dada MBBS: ఒరిజినల్ ను మించిన రీమేక్ , ఇప్పుడు రీ రిలీజ్

కొన్ని సినిమాలను భాషతో సంబంధం లేకుండా వేరే భాషలో చూసినప్పుడు, చాలా భావోద్వేగానికి గురవుతాం. ఇతర భాషల్లో ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. ఆయా సినిమాలను తెలుగు భాషలో కూడా అందించడానికి అప్పటినుంచి ఇప్పటివరకు నిర్మాతలు అత్యుత్సాహం చూపిస్తూ ఉంటారు. కానీ అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు. అప్పుడు వేరే భాషల్లో ఒక సినిమా వస్తే కేవలం కొంతమందికి మాత్రమే ఆ సినిమాను చూసే అవకాశం ఉండేది.

కానీ ఇప్పుడు అలా కాదు గొప్ప సినిమా ఏ భాషలో ఉన్న సాధారణ ప్రేక్షకుడు కూడా ఓటిటి రూపంలో సినిమాను చూడగలుగుతున్నాడు. అదే సినిమాను మళ్ళీ తెలుగులో రీమేక్ చేస్తారు అంటే పెదవి విరుస్తున్నారు చాలామంది ప్రేక్షకులు. ఇప్పటివరకు రీసెంట్ టైమ్స్ లో మెగాస్టార్ చేసిన ఖైదీ నెంబర్ 150, గాడ్ ఫాదర్, భోళా శంకర్ లాంటి సినిమాలు కొంచెం నిరుత్సాహాన్ని మిగిల్చాయి.

ఇకపోతే కొన్ని సినిమాలు ఒరిజినల్ కంటే కూడా రీమేక్ చూసినప్పుడే ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తాయి. అటువంటి సినిమాల్లో ఎస్ జె సూర్య దర్శకత్వంలో వచ్చిన ఖుషి సినిమా ఒకటి. పవన్ కళ్యాణ్ నటించిన ఈ ఖుషి సినిమా ఒరిజినల్ ఖుషి కంటే కూడా అద్భుతంగా ఉంటుంది. అలానే మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో వచ్చిన శంకర్ దాదా ఎంబిబిఎస్ ఈ సినిమా కూడా ఒరిజినల్ కంటే బాగుంటుంది.

- Advertisement -

రాజ్ కుమార్ హిరానీ దర్శకుడిగా పరిచయమైన మున్నాభాయ్ ఎంబిబిఎస్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. వాస్తవానికి ఒరిజినల్ కంటే కూడా ఈ సినిమా తెలుగులో చాలా బాగుంటుంది. మెగాస్టార్ కామెంట్ టైమింగ్, క్లైమాక్స్ లో వచ్చే కమర్షియల్ ఫైట్ ఇవన్నీ ఈ సినిమాకి సరిగ్గా కుదిరాయి. సాధారణ ప్రేక్షకులతో పాటు సందేశాత్మక చిత్రాలను కోరుకొని ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఒక మంచి ట్రీట్ అని చెప్పొచ్చు. ఈ సినిమా ఇప్పుడు మళ్లీ నవంబర్ 4న రీ రిలీజ్ కాబోతోంది. ఒకప్పుడు థియేటర్లో మిస్సయిన అభిమానులంతా ఈసారి మెగాస్టార్ స్టెప్పులకు, మెగాస్టార్ కామెడీ టైమింగ్ కు, మెగాస్టార్ పర్ఫామెన్స్ కు ఫిదా అవడానికి రెడీగా ఉన్నారు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు