Samantha – Naga Chaitanya: సామ్ – చై ఇద్దరికీ ఒకే ప్రాబ్లమ్… అసలేమైంది?

అక్కినేని నాగ చైతన్య, సమంత రూత్ ప్రభు… వీరికి డీవోర్స్ అయి రెండేళ్లు దాటిపోతుంది. అయినా, ఈ విడిపోయిన జంట గురించి ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది. వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ న్యూస్‌లో వీరి పర్సనల్ స్టోరీ కాకుండా ప్రొఫెషనల్ విషయాలను చూద్ధాం.

సామ్, చైతన్య విడిపోయినా… వీరిక సమస్యలు మాత్రం కలిసే వస్తున్నాయి. ఇప్పుడు వీరికేం సమస్యా అనుకుంటున్నారా? ఉంది. అదేంటంటే… సమంత, నాగ చైతన్య నటించిన వెబ్ సిరీస్ లు రిలీజ్ అవ్వడం లేదు. అంటే.. ఇక్కడ సామ్, చై కలిసి నటించిన వెబ్ సిరీస్ లు అనుకోవద్దు. సమంత ఎంతో కష్టపడి చేసిన బాలీవుడ్ వెర్షన్ సిటాడెల్ గానీ, నాగ చైతన్య ఫస్ట్ టైం ఓటీటీలో చేస్తున్న దూత వెబ్ సిరీస్ గానీ విడుదలకు నోచుకోవడం లేదు.

సమంత బాలీవుడ్‌లో స్ట్రాంగ్ గా అడుగుపెట్టాలని తీసిన వెబ్ సిరీస్ సిటాడెల్. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ అయిపోయింది. డబ్బింగ్ పార్ట్ కూడా పూర్తి అయింది. కానీ, స్ట్రీమ్ చేయడానికి ఇంకా రోజులు లెక్కిస్తున్నారు. సిటాడెట్ ఇంగ్లీష్ వెర్షన్ ఎప్పుడో వచ్చింది. ఆ సిరీస్‌కు అనుకున్నంత మంచి టాక్ రాలేదు. దీంతో ఈ బాలీవుడ్ వెర్షన్ సిటాడెల్ తో అయినా, హిట్ కొట్టాలని డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే చూస్తున్నారు. కానీ, స్ట్రీమింగ్ కు మాత్రం తీసుకురావడం లేదు.

- Advertisement -

అలాగే నాగ చైతన్య ఓటీటీలోకి డెబ్యూ ఇస్తున్న వెబ్ సిరీస్ దూత. ఈ సిరీస్ షూటింగ్ కూడా పూర్తి అయి దాదాపు ఏడాది అవుతుంది. లాస్ట్ ఇయర్ దసరాకే స్ట్రీమింగ్ అంటూ చెప్పారు. తీరా చూస్తే ఈ ఇయర్ దసరా కూడా వెళ్లిపోయింది. కానీ దూత ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తుందో క్లారిటీ కూడా లేదు.

యాదృచ్చికంగా ఈ విడిపోయిన జంట నటించిన రెండు వెబ్ సిరీస్ లను అమెజాన్ ప్రైమ్ వీడియోనే నిర్మించింది. దీంతో అమెజాన్ ప్రైమ్.. నాగ చైతన్య, సమంత వెబ్ సిరీస్ లను ఎందుకు స్ట్రీమింగ్ చేయకుండా ఉంచారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. ఈ వెబ్ సిరీస్‌లా కోసం అటు నాగ చైతన్య ఫ్యాన్స్, ఇటు సమంత ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ ఎదురుచూపులకు ఎప్పుడు తెర పడుతుందో చూడాలి మరి.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు