Bigg Boss Season-8 : బిగ్ బాస్ ఇక దబిడి దిబిడే

బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  మొదట బాలీవుడ్లో స్టార్ట్ అయిన ఈ షో తర్వాత మిగతా ఇండస్ట్రీలో కూడా మొదలైంది.  ప్రస్తుతం తెలుగులో ఈ షో మొత్తం ఆరు సీజన్స్  పూర్తి చేసుకొని, ఇప్పుడు ఏడవ సీజన్ తో కొనసాగుతుంది.  బిగ్ బాస్ మొదటి సీజన్ స్టార్ట్ అయినప్పుడు చాలామంది తెలిసిన సెలెబ్రెటీస్ తో ఈ షోను మొదలుపెట్టారు.  యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ షోకి హోస్టుగా వ్యవహరించి షో ను  వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు.

తర్వాత సీజన్ 2 లో  నాని హోస్ట్ గా కనిపించి, నాని కూడా తన సామర్థ్యం మేరకు తన పర్ఫామెన్స్ తో, తన మేనరిజమ్స్ తో, తన ఆటిట్యూడ్ తో, ఈ షో ని సీజన్ ఒన్ కి ఎక్కడ తగ్గకుండా తీసుకెళ్లాడు.  ప్రస్తుతం ఈ షో కి హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నారు.  నాగార్జున కూడా ఈ షోని తన రేంజ్ లో చూపిస్తూ, సీజన్ సీజన్ కి ఈ షో లెవెల్ ను పెంచుకుంటూ వెళ్తున్నారు.  అయితే బిగ్ బాస్  సీజన్స్ పెరుగుతున్నకొద్దీ తెలిసిన సెలబ్రిటీలు కాకుండా, తెలుసుకోవాల్సిన సెలబ్రిటీస్ ఎక్కువగా ఎంట్రీ  ఇస్తున్నారు.

ఏదేమైనా మాటీవీలో ప్రసారమయ్యే ఈ షో కి మంచి టిఆర్పి రేటింగ్ ఉంది.  చాలామంది బిగ్ బాస్ అంటే చాలా ఇంట్రెస్ట్ గా చూస్తారు.  బిగ్ బాస్ గురించి రివ్యూ చెప్తారు, బిగ్ బాస్ కంటెస్టెంట్ల వ్యక్తిత్వాలు గురించి అనాలిసిస్ చేస్తుంటారు.  అంతా బాగా పాపులర్ అయింది ఈ షో. అయితే ఈ షో  నెక్స్ట్ సీజన్ కి నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా  వ్యవహరించినట్లు తెలుస్తుంది.

- Advertisement -

ఇదివరకే అన్ స్టాపబుల్ షో తో తనలోని అన్ స్టాపబుల్ జోష్ ను, తనలోని టాలెంట్ ని, తనలోని వ్యక్తిత్వాన్ని బయటికి తీశారు నందమూరి బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ గురించి ప్రస్తావన వస్తే అన్ స్టాపబుల్
ముందు అన్ స్టాపబుల్ తర్వాత అని చెప్పొచ్చు. అంత పెద్దగా పాపులర్ అయింది ఆ షో.  ఆ షో  చేసిన తర్వాతే బాలయ్య వరుస హిట్లు కూడా కొట్టారు. బాలయ్యను చూసే విధానం ఆ షో తర్వాత మారిపోయింది.  ఇప్పుడు మళ్ళీ బాలయ్య బిగ్ బాస్ కి హోస్ట్  వ్యవహరిస్తాడు అని తెలిసినప్పుడు చాలామందికి ఒక రకమైన క్యూరియాసిటీ ఏర్పడుతుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు